AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోల్డ్ గాలాలో మెరిసిన గ్లోబల్ బ్యూటీ! 20 ఏళ్ల నాటి చీరతో అవార్డు అందుకున్న స్టార్

ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే మెట్ గాలా 2026కు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా దూరంగా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఆమె నటించిన 'సిటాడెల్' కొత్త సీజన్ ప్రమోషన్లతో బిజీగా ఉండటమే. అయితే అదే సమయంలో జరిగిన 'గోల్డ్ హౌస్ గోల్డ్ గాలా 2026'లో మాత్రం ఆమె సందడి చేశారు. వరుసగా రెండో ఏడాది కూడా ఆమె ప్రతిష్టాత్మకమైన 'గ్లోబల్ వాన్‌గార్డ్ హానర్'ను అందుకుని చరిత్ర సృష్టించారు.

గోల్డ్ గాలాలో మెరిసిన గ్లోబల్ బ్యూటీ! 20 ఏళ్ల నాటి చీరతో అవార్డు అందుకున్న స్టార్
Priyanka Chopraa
Nikhil
|

Updated on: May 13, 2026 | 6:40 PM

Share

గోల్డ్ గాలా వేదికపై ప్రియాంక చోప్రా తన అదిరిపోయే అవుట్‌ఫిట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్ రూపొందించిన ఈ గౌను కేవలం ఫ్యాషన్ కోసం మాత్రమే కాదు, భారతీయ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచింది. సౌత్ ఏషియన్ కమ్యూనిటీ తరపున గ్లోబల్ స్టేజ్ మీద ప్రాతినిధ్యం వహిస్తూనే, లక్నోకు చెందిన ప్రసిద్ధ ‘చికంకారి’ ఎంబ్రాయిడరీ వర్క్‌ను ఆమె ప్రపంచానికి పరిచయం చేశారు.

20 ఏళ్ల నాటి చీరతో..

ప్రియాంక ధరించిన ఈ శిల్పకళాత్మకమైన గౌను వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఇది ఏదో సాధారణ వస్త్రంతో తయారు చేసినది కాదు. బజార్ ఇండియా కథనం ప్రకారం, ఏకంగా 20 ఏళ్ల నాటి పాత చికంకారి చీరను ఉపయోగించి అమిత్ అగర్వాల్ ఈ అద్భుతమైన గౌనును డిజైన్ చేశారు.

సెమీ-చీర డ్రేప్ లాగా కనిపించే ఈ గౌనులో, కుడి భుజం నుండి వస్త్రం కిందికి జారుతూ వెనుక వైపు ట్రైన్ లాగా కనిపిస్తుంది. స్కర్ట్ భాగానికి థై-హై స్లిట్ ఇవ్వడంతో ఆధునికత, సంప్రదాయం కలగలిసినట్లుగా ఉంది.* అమీ పటేల్ స్టైలింగ్ చేయగా, ప్రియాంక ఖరీదైన బల్గేరీ నెక్‌లెస్, స్టడ్స్‌తో తన రూపాన్ని మరింత మెరిపించారు. మేకప్ ఆర్టిస్ట్ మాథ్యూ రేమండ్ బ్రౌన్ టోన్స్ మరియు పింక్ షేడ్స్‌తో కియారాకు సహజమైన లుక్ ఇచ్చారు. హెయిర్ స్టైలిస్ట్ ఇరినెల్ డి లియోన్ జుట్టును స్ట్రెయిటెన్ చేసి బ్లో-డ్రై ఫినిషింగ్‌తో పూర్తి చేశారు.

గ్లోబల్ వాన్‌గార్డ్ గౌరవం

వివిధ సంస్కృతులను కథల ద్వారా కలిపే ప్రయత్నం చేసినందుకు, ప్రపంచ స్థాయిలో సినిమా రంగానికి అందించిన సహకారానికి గుర్తుగా ప్రియాంక చోప్రాకు ఈ ‘గ్లోబల్ వాన్‌గార్డ్ హానర్’ దక్కింది. ప్రస్తుతం ఆమె పలు అంతర్జాతీయ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే భారతీయ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం మాత్రం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ‘వారణాసి’. ఈ చిత్రం ఏప్రిల్ 7, 2027న థియేటర్లలోకి రానుంది.

Follow Us