AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: పవన్‏కు ఆ ఫుడ్ అంటే చాలా ఇష్టం.. ఎంతో ప్రేమతో తింటాడు.. తల్లి అంజనమ్మ కామెంట్స్..

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఇష్టమైన ఆహారం ఏంటో ఆయన తల్లి అంజనా దేవి పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇంట్లో చేసిన అన్ని వంటకాలను పవన్ కల్యాణ్ తింటారని.. చిన్నప్పటి నుంచే పవన్ ఎంతో సాధాసీదాగా ఉండేవారని.. ఏదీ అడిగి కోరుకునే అలవాటు లేదని అంజనాదేవి గుర్తుచేసుకున్నారు. అయితే.. ఓ ఫుడ్ మాత్రం మంచిగా ఇష్టంగా తింటారని చెప్పుకొచ్చారు.. అదేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

Pawan Kalyan: పవన్‏కు ఆ ఫుడ్ అంటే చాలా ఇష్టం.. ఎంతో ప్రేమతో తింటాడు.. తల్లి అంజనమ్మ కామెంట్స్..
Pawan Kalyan Food
Shaik Madar Saheb
|

Updated on: May 14, 2026 | 4:57 PM

Share

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడూ బిజీబిజీగా గడుపుతారు.. ఇటు ప్రజాప్రతినిధిగా.. అటు షూటింగ్‌లలో నిరంతరం ఏదో ఒక పనిలో ఉంటారు.. ప్రస్తుతం సామాజిక బాధ్యతలను మోస్తూ.. ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. స్టార్ హీరోగా టాలీవుడ్ లో రాణించిన పవన్ కళ్యాణ్.. రాజకీయాల్లోనూ అదే స్టార్‌డమ్‌ను కొనసాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ జీవితం తెరిచిన పుస్తకం లాంటిది.. ఆయన ఏం చేసినా.. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ప్రతిదీ అభిమానులు అనుసరిస్తుంటారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఆయన తల్లి అంజనా దేవి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఆమె పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన ఫుడ్, అలాగే ఆయన అలవాట్లు, ఆధ్యాత్మిక భావాలను.. గుర్తుచేసుకున్నారు. కాగా.. ఆ ఇంటర్వ్యూలో అంజనాదేవి పవన్ కల్యాణ్ గురించి ఏం మాట్లాడారో చూద్దాం..

పవన్ కళ్యాణ్ అసాధారణమైన కష్టజీవి.. ఎటువంటి కష్టం ఎదురైనా, దాని గురించి ఎవరికీ చెప్పకుండా మౌనంగా భరిస్తారు.. అని అంజనాదేవి తెలిపారు.. చిన్నప్పటి నుండీ ఏ వస్తువునీ, సౌకర్యాన్నీ అడిగి కోరుకోలేదని.. భోజనానికి పిలిచినా వెంటనే వచ్చే అలవాటు లేదని.. ఇది కావాలి, అది కావాలి అని ఎప్పుడూ కోరలేదని.. అంజనమ్మ చెప్పుకొచ్చారు. ఆహారం విషయంలో నాన్-వెజ్ పలావ్ అంటే పవన్ కు ప్రత్యేక అభిమానమని.. ఇంట్లో చేసిన ఏ వంటకాన్ని అయినా ఇష్టంగా తింటారని, కానీ పలావ్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం.. అని అంజనాదేవి వివరించారు.

పవన్ కల్యాణ్ జీవితంలో దైవభక్తికి విశేష స్థానం ఉందని. చిన్ననాటి నుంచీ పవన్ కు ఆధ్యాత్మిక దీక్షలు తీసుకోవడం అలవాటని పేర్కొన్నారు.. అయ్యప్ప స్వామి మాల ధరించి దర్శనానికి వెళ్లడం, నరసింహ స్వామి క్షేత్రాలను సందర్శించడం, వారాహి దీక్షలు చేపట్టడం వంటివి పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక జీవనంలో భాగంగా చెప్పుకొచ్చారు.

ఇక పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆయనకు పుస్తకాలంటే విపరీతమైన అభిమానం.. ఏ చిన్న సమయం దొరికినా పుస్తకాలు చదివేందుకు ఆసక్తి చూపిస్తారు.. పవన్ కల్యాణ్ ప్రస్తుతం సైనస్ సర్జరీతో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవలే హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరి పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశించారు. అయితే.. త్వరలోనే పవన్ కల్యాణ్ పూర్తిగా కోలుకోని బాధ్యతలు స్వీకరించనున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us