వంటింటి రత్నం.. రోజుకో పచ్చి టమాటా తింటే ఆరోగ్యానికి తిరుగులేదు!

21 July  2026

Jyothi Gadda

మన భారతీయుల వంటింట్లో టమాటా లేని కూర ఉండదనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, చాలామంది టమాటాను కేవలం కూరలు, చట్నీలు వండటానికి మాత్రమే ఉపయోగిస్తారు. కానీ, 

టమాటాలకు ఆ ఎరుపు రంగును ఇచ్చే లైకోపీన్ అనే పదార్థం ఒక అత్యంత సమర్థవంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది శరీరంలోని కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. 

క్రమం తప్పకుండా పచ్చి టమాటా తినడం వల్ల ముఖ్యంగా ప్రొస్టేట్, ఊపిరితిత్తులు, కడుపు క్యాన్సర్ల ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది.

టమాటాలలో పొటాషియం, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. పొటాషియం రక్తనాళాలపై ఒత్తిడిని తగ్గించి, అధిక రక్తపోటును (BP) అదుపులో ఉంచుతుంది.  

చెడు కొలెస్ట్రాల్ (LDL), ట్రైగ్లిజరైడ్ల స్థాయిలను తగ్గించి, గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్ర సమస్యల నుండి రక్షణ ఇస్తుంది.

టమాటాలో ఉన్న విటమిన్ సీ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి ముడతలను తగ్గిస్తుంది. చర్మాన్ని సూర్యుని యూవీ (UV) కిరణాల నుండి రక్షించి సహజ సిద్ధమైన కాంతిని ఇస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

టమాటాలో ఉన్న విటమిన్ సీ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి ముడతలను తగ్గిస్తుంది. చర్మాన్ని సూర్యుని యూవీ (UV) కిరణాల నుండి రక్షించి సహజ సిద్ధమైన కాంతిని ఇస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

జలుబు, ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. వంటింట్లో సులభంగా దొరికే టమాటాను కేవలం కూరలకే పరిమితం చేయకుండా, ప్రతిరోజూ సలాడ్ రూపంలో ఒక పచ్చి టమాటాను తింటూ మీ ఆరోగ్యానికి తిరుగులేని రక్షణ కవచాన్ని ఏర్పరచుకోండి.