చిన్న పలుకులే కానీ పెద్ద ప్రయోజనం.. వీటితో ఎన్ని లాభాలో..

Samatha

21 July 2026

బాదం ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజూ నాలుగు నుంచి ఐదు బాదం పప్పులు తినడం వలన అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట.

బాదం

బాదం ప్రతి రోజూ ఉదయం  బాదం పప్పులు తినడం వలన ఇందులో ఉండే విటమిన్ ఈ, రైబోఫ్లావిన్ వంటివి మెదడు పనితీరుకు దోహదపడతాయి.

మెదడు పనితీరు

అంతే కాకుండా ప్రతి రోజూ బాదం పలుకులు తినడం వలన ఇది జ్ఞాపకశక్తి పెరిగేలా చేస్తుంది. మెమోరీ పవర్ పెంచుతుంది.

మెమోరీ పవర్

గుండె ఆరోగ్యానికి కూడా ఇవి చాలా మంచివి. ప్రతి రోజూ బాదం తినడం వలన ఇవి చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, గుండెకు మేలు చేస్తాయి.

గుండె ఆరోగ్యం

బాదంలో మెగ్నీషియం, పొటాషియం, ఎక్కువగా ఉండటం వలన ఇవి బీపీని కూడా కంట్రోల్ చేస్తాయి. గుండెకు మేలు చేస్తాయి.

బీపీ కంట్రోల్

అంతే కాకుండా బరువు నియంత్రణకు కూడా దోహద పడతాయి. ప్రతి రోజూ బాదం తినడం వలన త్వరగా బరువు తగ్గవచ్చును.

బరువు నియంత్రణ

జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా ఇవి చాలా మేలు చేస్తాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన ఇది మలబద్ధకం సమస్యను తగ్గించి జీర్ణక్రియకు తోడ్పడుతుంది.

మలబద్ధకం

పేగు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఉంటే విటమిన్స్, మినరల్స్, పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంపొందిస్తాయి.

పేగు ఆరోగ్యం