AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3 రోజులుగా ముగ్గురు అన్నదమ్ములు అదృశ్యం.. ఎక్కడికెళ్లారో? వీడని మిస్టరీ..

విశాఖపట్నం గాజువాకలో ముగ్గురు అన్నదమ్ముల అదృశ్యం కలకలం రేపుతోంది. ఇంటర్మీడియట్, తొమ్మిదో తరగతి, ఐదో తరగతి చదువుతున్న ముగ్గురు బాలురు రెండు రోజులుగా కనిపించకుండా పోయారు. కుటుంబ సమస్యల కారణంగా తల్లిదండ్రులు దూరంగా ఉండటంతో వీరు చిన్నాన్న సంరక్షణలో ఉంటున్నారు. ఉన్నట్లుండి పిల్లలు కనిపించకుండా పోవడంతో స్థానికంగా కలకలం రేగింది..

3 రోజులుగా ముగ్గురు అన్నదమ్ములు అదృశ్యం.. ఎక్కడికెళ్లారో? వీడని మిస్టరీ..
Gajuwaka Missing Children Case
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Jul 22, 2026 | 9:49 AM

Share

వాళ్లు ముగ్గురు అన్నదమ్ములు.. పెద్దవాడు ఇంటర్మీడియట్.. మిగిలిన ఇద్దరూ తొమ్మిది, ఐదో తరగతి చదువుతున్నారు. చిన్నన్న దగ్గర ఉంటున్నారు. ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా ఆ ముగ్గురు అదృశ్యం అయ్యారు. ఎక్కడికి వెళ్లారో, ఏమయ్యారో తెలియదు. దీంతో ఆ బాలలను సంరక్షిస్తున్న చిన్నాన్నలో ఆందోళన మొదలైంది. పోలీసులను ఆశ్రయించేసరికి రంగంలోకి ప్రత్యేక బృందాలు దిగాయి. విశాఖ గాజువాకలో ఈ ఘటన జరిగింది.

పాత గాజువాక కైలాస నగర్ కు చెందిన.. రాఘవేంద్రరావు అశ్వని దంపతులకు ముగ్గురు సంతానం. పెద్దవాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. రెండో కొడుకు నైన్త్ క్లాస్.. చిన్న కొడుకు ఐదో తరగతి. కుటుంబ కలహాల కారణంగా భార్యాభర్తలు దూరమయ్యారు. భర్త చెప్పకుండా ఎక్కడికో ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. భార్య అశ్విని తన స్వగ్రామం మహారాష్ట్రలోని సోలాపూర్ పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో ముగ్గురు పిల్లలు తన చిన్నాన్న దగ్గర గాజువాకలో ఉంటున్నారు. సోమలింగ ఆ ముగ్గురు పిల్లలను చదివిస్తూ ఉన్నాడు. రెండు రోజుల క్రితం.. ఏమైందో ఏమో కానీ ఈ ముగ్గురు పిల్లలు ఒక్కసారి కనిపించలేదు. వారి వస్త్రాలు ఆధార కార్డులు సర్టిఫికెట్లు కూడా లేవు. దీంతో చిన్నాన్న సోమలింగ అంతా వెతికాడు. కనిపించిన వారందరికీ అడిగాడు. పిల్లల కోసం ఆరా తీశాడు. ఫలితం లేకపోయేసరికి గాజువాక పోలీసులను ఆశ్రయించాడు. కాల్ డేటా తో పాటు సాంకేతిక ఆధారాలను పరిశీలించారు పోలీసులు. ప్రత్యేక బృందాలుగా రంగంలోకి దిగారు.

అక్కడికే వెళ్లిపోయారా..?

పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే 20 రోజుల క్రితం పిల్లల మేనమామ అక్షయ విశాఖ వచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. ‘ ఇంటి నుంచి బయటకు వెళ్లిన పిల్లలు ముగ్గురు తిరిగి రాలేదు. చిన్నాన్న ఫిర్యాదు చేశారు. 20 రోజుల క్రితం విశాఖ వచ్చిన పిల్లల మామయ్య వారికి ఒక మొబైల్ ఫోన్ ఇచ్చాడు. ఆ తర్వాత అతనితోనే టచ్ లో ఉన్నట్టు మా విచారణలో తేలింది. పిల్లల సర్టిఫికెట్లు కూడా మొబైల్ ద్వారా మామయ్యకి పంపినట్టు గుర్తించాము. దీన్నిబట్టి.. వారితోనే పిల్లలు టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం.. ప్రత్యేక బృందాలుగా గాలిస్తున్నాం. త్వరలోనే కేసును చేదిస్తాం.’ అని అన్నారు గాజువాక సీఐ వాసు నాయుడు.

Follow Us
పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? ఈ మిస్టేక్స్ చేస్తే నష్టం
పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? ఈ మిస్టేక్స్ చేస్తే నష్టం
బిగ్ బాస్ తెలుగు 10 నుంచి ఆమె అవుట్
బిగ్ బాస్ తెలుగు 10 నుంచి ఆమె అవుట్
లవంగాల నైట్ క్రీమ్‌‌తో ముడతలు మాయం..ఇంట్లోనే తయారు చేసుకునే సహజ
లవంగాల నైట్ క్రీమ్‌‌తో ముడతలు మాయం..ఇంట్లోనే తయారు చేసుకునే సహజ
రాష్ట్రంలో కొత్తగా మరో 9లక్షల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!
రాష్ట్రంలో కొత్తగా మరో 9లక్షల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!
పచ్చిమిర్చిని తక్కువ అంచనా వేయకండి!ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే
పచ్చిమిర్చిని తక్కువ అంచనా వేయకండి!ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే
ఈ టీచర్ మామూలోడు కాదు.. చిట్టీల పేరుతో కోట్లు వసూల్.. కట్ చేస్తే
ఈ టీచర్ మామూలోడు కాదు.. చిట్టీల పేరుతో కోట్లు వసూల్.. కట్ చేస్తే
ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేను..
ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేను..
పాకిస్థాన్ క్రికెట్‌కు వరుస షాకులు.. ఏకంగా రూ.25 కోట్ల భారీ నష్టం
పాకిస్థాన్ క్రికెట్‌కు వరుస షాకులు.. ఏకంగా రూ.25 కోట్ల భారీ నష్టం
ఆర్డర్ లేట్‌గా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై భార్యభర్తల దాడి..
ఆర్డర్ లేట్‌గా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై భార్యభర్తల దాడి..
ఐదే ఎపిసోడ్స్.. థ్రిల్ నెక్ట్స్ లెవెల్.. OTTలో ఈ సిరీస్ చూశారా?
ఐదే ఎపిసోడ్స్.. థ్రిల్ నెక్ట్స్ లెవెల్.. OTTలో ఈ సిరీస్ చూశారా?