18 ఏళ్లకే పెళ్లి.. 20 ఏళ్లకే తల్లి.. రెండుసార్లు విడాకుల నరకం..
Rajitha Chanti
Pic credit - Instagram
04 October 2026
బుల్లితెరలో 'కసౌటీ జిందగీ కే' సీరియల్ ద్వారా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్న నటి శ్వేతా తివారీ.
రీల్ లైఫ్‌లో అపారమైన ప్రేమను సొంతం చేసుకున్న ఆమె రియల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో ఘోరమైన చేదు అనుభవాలను ఎదుర్కొంది.
అడుగడుగునా జీవితం ఎదురుదెబ్బలు తీసినా, ఒక బలమైన మహిళగా అడుగులు వేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
చాలా చిన్న వయస్సులోనే 18 ఏళ్లకే నటుడు రాజా చౌదరిని ప్రేమించి.. పెద్దల సమక్షంలో శ్వేతా తివారీ వివాహం జరిగింది.
20 ఏళ్ల వయస్సులోనే ఆమె కుమార్తె పాలక్ తివారీకి జన్మనిచ్చింది. అయితే, కొద్దికాలానికే రాజా చౌదరి మద్యపానానికి బానిసయ్యాడు.
తొమ్మిదేళ్ల పాటు ఈ కష్టాలను భరించిన శ్వేతా, 2007లో ధైర్యంగా అతనికి విడాకులు ఇచ్చి తన కుమార్తెతో బయటకు వచ్చేసింది.
మొదటి భర్త నుంచి విడిపోయిన కొన్నేళ్లకు నటుడు అభినవ్ కోహ్లీతో శ్వేతాకు పరిచయం ఏర్పడి, 2013లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు.
ఈ దంపతులకు రయాన్ష్ అనే కుమారుడు పుట్టాడు. వేధింపులు పెరగడంతో 2019లో అతనికి కూడా స్వస్తి చెప్పి రెండోసారి విడాకులు తీసుకుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్