AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: గెలవడం చేతకాక కోట్లు పోగొట్టుకున్న పాక్.. పీసీబీకి దిమ్మతిరిగే షాక్

Pakistan: పాకిస్థాన్ క్రికెట్ జట్టు వరుస వైఫల్యాలు ఇప్పుడు ఆ దేశ క్రికెట్ బోర్డుపై ఆర్థిక ప్రభావం చూపిస్తున్నాయి. హోమ్ సిరీస్ బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ కోసం PCB భారీ ధరను నిర్ణయించినా ప్రైవేట్ బ్రాడ్‌కాస్టర్లు ఆసక్తి చూపలేదు. దీంతో ప్రభుత్వ ఛానెల్‌తో తక్కువ మొత్తానికి ఒప్పందం చేసుకోవాల్సి వచ్చి బోర్డుకు రూ.25 కోట్ల నష్టం వాటిల్లింది. జట్టు ప్రదర్శనపై అభిమానుల ఆసక్తి తగ్గడం కూడా ఆదాయాన్ని మరింత ప్రభావితం చేసింది.

Pakistan: గెలవడం చేతకాక కోట్లు పోగొట్టుకున్న పాక్.. పీసీబీకి దిమ్మతిరిగే షాక్
Pakistan Cricket Team
Rakesh
|

Updated on: Oct 04, 2026 | 6:15 PM

Share

Pakistan: పాకిస్థాన్ క్రికెట్ జట్టు వరుస వైఫల్యాలు అలాగే మైదానంలో పేలవమైన ప్రదర్శన ఆ దేశ క్రికెట్ బోర్డు (PCB) ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జట్టు ఆటతీరు నానాటికీ దారుణంగా మారుతుండటంతో బ్రాడ్‌కాస్టర్లు ముందుకు రాక పీసీబీకి కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లింది. దేశీయ అంతర్జాతీయ సీజన్‌కు సంబంధించి మీడియా హక్కుల విక్రయంలో బోర్డు ఆశించిన స్థాయిలో స్పందన లభించకపోవడంతో ఆర్థికంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

పీసీబీకి భారీగా తగ్గిన ఆదాయం

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ హోమ్ సిరీస్ బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ కోసం బేస్ ధరను 60 కోట్ల పాకిస్థానీ రూపాయలుగా నిర్ణయించింది. అయితే జాతీయ అలాగే అంతర్జాతీయ ప్రైవేట్ బ్రాడ్‌కాస్టర్లు ఎవరూ కూడా ఈ బిడ్డింగ్‌లో పాల్గొనడానికి ఆసక్తి చూపలేదు. పాకిస్థాన్ జట్టు నిలకడలేమి ప్రదర్శన, పడిపోయిన బ్రాండ్ విలువ కారణంగా ఏ టెలివిజన్ నెట్‌వర్క్ కూడా ముందుకు రాలేదు. దీంతో చేసేది లేక పీసీబీ తన డిమాండ్‌ను భారీగా తగ్గించుకోవాల్సి వచ్చింది. చివరికి ప్రభుత్వ ఛానెల్ అయిన పీటీవీ స్పోర్ట్స్‌తో కేవలం 35 కోట్ల రూపాయలకే ఒప్పందం కుదుర్చుకోవాల్సి వచ్చింది. దీనివల్ల పీసీబీకి నేరుగా 25 కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లింది.

అభిమానులు మొహం చాటేయడం అసలు కారణం

పాకిస్థాన్ జట్టు గత కొన్ని సంవత్సరాలుగా అన్ని ఫార్మాట్లలోనూ తీవ్రంగా నిరాశపరుస్తోంది. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో ఆ జట్టు ప్రదర్శన అత్యంత దయనీయంగా ఉంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. అలాగే ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో ఘోర పరాజయాలపాలైంది. గత రెండు టీ20 ప్రపంచ కప్‌లలో కనీసం సెమీఫైనల్ చేరలేకపోయింది. మరోవైపు ఇటీవల జరిగిన ఆసియా క్రీడల ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో ఓడిపోయి స్వర్ణ పతకాన్ని కోల్పోయింది. బాబర్ ఆజమ్, షాహీన్ షా అఫ్రిది వంటి స్టార్ ఆటగాళ్ల ఫామ్ కోల్పోవడం కూడా జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది.

బ్రాడ్‌కాస్టర్ల వెనకడుగు

పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై అభిమానుల్లో ఆసక్తి క్రమంగా తగ్గిపోవడం, టీవీ వ్యూవర్షిప్ గణనీయంగా పడిపోవడం వంటి కారణాల వల్ల ప్రకటనదారులు కూడా వెనకడుగు వేశారు. ఇంగ్లండ్ జట్టు రాక, శ్రీలాంకాతో ట్రై సిరీస్ ఉన్నప్పటికీ బ్రాడ్‌కాస్టర్లు ముందుకు రాకపోవడం పీసీబీలో కలవరం రేపింది. మొహ్సిన్ నఖ్వీ నేతృత్వంలోని పీసీబీ బోర్డు తప్పుడు అంచనాల కారణంగా ఈ భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. మైదానంలో ఆటగాళ్ల చెత్త ప్రదర్శనే ఈ ఆర్థిక పతనానికి ప్రధాన కారణమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పాకిస్థాన్ క్రికెట్‌కు వరుస షాకులు.. ఏకంగా రూ.25 కోట్ల భారీ నష్టం
పాకిస్థాన్ క్రికెట్‌కు వరుస షాకులు.. ఏకంగా రూ.25 కోట్ల భారీ నష్టం
ఆర్డర్ లేట్‌గా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై భార్యభర్తల దాడి..
ఆర్డర్ లేట్‌గా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై భార్యభర్తల దాడి..
ఐదే ఎపిసోడ్స్.. థ్రిల్ నెక్ట్స్ లెవెల్.. OTTలో ఈ సిరీస్ చూశారా?
ఐదే ఎపిసోడ్స్.. థ్రిల్ నెక్ట్స్ లెవెల్.. OTTలో ఈ సిరీస్ చూశారా?
ఆ పాత్రను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను
ఆ పాత్రను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను
పెళ్లి ఆలస్యమవుతోందా..? మంగళ దోషం ప్రభావం కావచ్చు.. ఈ పరిహారాలతో
పెళ్లి ఆలస్యమవుతోందా..? మంగళ దోషం ప్రభావం కావచ్చు.. ఈ పరిహారాలతో
ధర మారదు.. బరువు పెరగదు.. పార్లే-జి వేల కోట్ల లాభాల వెనుకున్న..
ధర మారదు.. బరువు పెరగదు.. పార్లే-జి వేల కోట్ల లాభాల వెనుకున్న..
ప్రియురాలితో దొరికిపోయిన భర్త..భార్యను కారుతో ఈడ్చుకెళ్లిన దారుణం
ప్రియురాలితో దొరికిపోయిన భర్త..భార్యను కారుతో ఈడ్చుకెళ్లిన దారుణం
ట్రైన్ జర్నీ చేసే ప్రతి ఒక్కరూ ఇవి పాటించాల్సిందే.. లేదంటే
ట్రైన్ జర్నీ చేసే ప్రతి ఒక్కరూ ఇవి పాటించాల్సిందే.. లేదంటే
ఆ ఒక్కదెబ్బతో స్టోరీనే మార్చేశారట
ఆ ఒక్కదెబ్బతో స్టోరీనే మార్చేశారట
ఇంకా మిస్టరీగానే ఇద్దరి పైలట్ల పేర్లు.. ఫ్లై దుబాయ్ హీరోలు ఎవరు?
ఇంకా మిస్టరీగానే ఇద్దరి పైలట్ల పేర్లు.. ఫ్లై దుబాయ్ హీరోలు ఎవరు?