పూల చీరలో గత్తరలేపుతున్న హీరోయిన్.. ఫోటోస్ చూస్తే మతిపోద్ది సామీ..
Rajitha Chanti
Pic credit - Instagram
13 May 2026
టాలీవుడ్ యువ నటి, బిగ్‌బాస్ ఫేమ్ వితికా షేరు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులను అలరిస్తూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే.
నిరంతరం తన లేటెస్ట్ ఫోటోషూట్స్, వ్యక్తిగత విశేషాలను పంచుకునే వితికా, తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
నీలిరంగు (బ్లూ కలర్) చీరలో ఆమె కనిపిస్తున్న తీరు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సాధారణంగానే వితికా షేరు చీరకట్టులో ఎంతో పద్ధతిగా, అందంగా కనిపిస్తుంది.
అయితే ఈ తాజా ఫోటోషూట్‌లో ఆమె ఎంచుకున్న నీలిరంగు డిజైనర్ శారీ ఆమెకు మరింత నిండుదనాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ అందరిని ఆకట్టుకుంటున్నాయి.
లేత నీలిరంగుపై ఆకర్షణీయమైన డిజైన్ ఉన్న ఈ శారీలో వితికా తన వయ్యారాలతో అందాల విందు చేస్తోంది. ఆమె ఇచ్చిన పోజులు కుర్రకారును ఆకట్టుకుంటున్నాయి.
తక్కువ మేకప్, సింపుల్ హెయిర్ స్టైల్, ఆకర్షణీయమైన చిరునవ్వుతో వితికా దేవకన్యలా మెరిసిపోతోంది. హీరో వరుణ్ సందేశ్ భార్యగా అందరికీ సుపరిచితురాలు.
అంతకుముందే పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే 'బిగ్‌బాస్' రియాలిటీ షో ద్వారా ఈ జంట తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది
ఆ షోలో తన ఆట తీరుతో, స్పష్టమైన వ్యక్తిత్వంతో వితికా మంచి క్రేజ్ సంపాదించుకుంది. వితికా షేరు ఒక సక్సెస్‌ఫుల్ డిజిటల్ క్రియేటర్‌గా కూడా రాణిస్తోంది.