- Telugu News Photo Gallery Cricket photos IPL 2023: Know all about the CSK all rounder Shivam Dube and Anjum Khan's love story
సీఎస్కే స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే భార్య ఎవరో తెలుసా? వీరి లవ్‌స్టోరీ సినిమా కథకు ఏ మాత్రం తీసిపోదు..
పీఎల్ ఫైనల్‌లో శివమ్ దూకుడుగా ఆడి చెన్నైను ఛాంపియన్‌గా నిలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఇక దూబే వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. తన చిరకాల స్నేహితురాలు అంజుమ్‌ను 2021లో వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వీరికి ఓ చిన్న కుమారుడు ఉన్నాడు.
Updated on: Jun 03, 2023 | 1:40 PM

PL 2023 ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించి ఐదోసారి ఛాంపియన్‌గా ఆవిర్భవించింది. కాగా ఈ మెగా టోర్నీలో ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఆద్యంతం అద్భుతంగా రాణించాడు.

ఐపీఎల్ ఫైనల్‌లో శివమ్ దూకుడుగా ఆడి చెన్నైను ఛాంపియన్‌గా నిలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఇక దూబే వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. తన చిరకాల స్నేహితురాలు అంజుమ్‌ను 2021లో వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వీరికి ఓ చిన్న కుమారుడు ఉన్నాడు.

అంజుమ్ ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ యూనివర్సిటీ నుంచి ఫైన్ ఆర్ట్స్‌లో పట్టభద్రురాలైంది. శివమ్ తో అంజుమ్ ప్రేమాయణం అక్కడే మొదలైంది.

అంజుమ్‌కి యాక్టింగ్ అండ్ మోడలింగ్ అంటే చాలా ఇష్టం. కొన్ని బాలీవుడ్ సినిమాలకు పనిచేసింది. అలాగే కొన్ని హిందీ సీరియల్స్‌తో పాటు మ్యూజిక్ వీడియోల్లోనూ నటించింది

అంజుమ్ ఖాన్ ముస్లిం. మరోవైపు శివమ్ దూబే హిందువు. అయితే మతం వీరి ప్రేమకు అడ్డురాలేదు. ఇరు పెద్దల అనుమతితో హిందూ, ముస్లిం సంప్రదాయాలను అనుసరించి 2021లో దూబె, అంజుమ్ వివాహం చేసుకున్నారు.




