Sharwanand: శర్వానంద్‌ ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌.. సంగీత్‌లో సందడి చేసిన రామ్ చరణ్‌.. ఫొటోస్‌ చూశారా?

టాలీవుడ్‌ ప్రామిసింగ్‌ హీరో శర్వానంద్‌ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజస్థాన్‌లోని జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌ ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌కు వేదిక కానుంది. ఇందుకోసం జైపూర్‌ ప్యాలెస్‌ సుందరంగా ముస్తాబైంది. వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, సన్నిహితులు ఇప్పటికే జైపూర్‌ ప్యాలెస్‌కు చేరుకున్నారు.

Sharwanand: శర్వానంద్‌ ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌.. సంగీత్‌లో సందడి చేసిన రామ్ చరణ్‌.. ఫొటోస్‌ చూశారా?
Sharwanand, Ramcharan
Follow us
Basha Shek

|

Updated on: Jun 04, 2023 | 9:59 AM

టాలీవుడ్‌ ప్రామిసింగ్‌ హీరో శర్వానంద్‌ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజస్థాన్‌లోని జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌ ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌కు వేదిక కానుంది. ఇందుకోసం జైపూర్‌ ప్యాలెస్‌ సుందరంగా ముస్తాబైంది. వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, సన్నిహితులు ఇప్పటికే జైపూర్‌ ప్యాలెస్‌కు చేరుకున్నారు. ఇక ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా శుక్రవారం రాత్రి హల్దీ, సంగీత్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. శర్వానంద్‌ క్లోజ్‌ ఫ్రెండ్ రామ్ చరణ్‌ కూడా సంగీత్ వేడుకల్లో సందడి చేశాడు. వీరితో పాటు శర్వా స్నేహితులు అఖిల్ అక్కినేని, రానా దగ్గుబాటితో పాటు పలువురు తారలు హాజరైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శర్వా పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇక ఇవాళ (జూన్‌ 3) రాత్రి 11.30 నిమిషాలకు వేదమంత్రాల సాక్షిగా రక్షిత మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు శర్వానంద్‌. మొత్తం రెండు రోజుల పాటు పెళ్లి సందడి ఉండనుంది.

అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా వర్క్ చేస్తున్న రక్షితతో జనవరి 26న శర్వా ఎంగేజ్‌మెంట్ అయింది. ఇక పెళ్లికోసం రాజస్థాన్ లోని జైపూర్ లీలా ప్యాలెస్‌ కోసం భారీగా ఖర్చు చేసారు శర్వానంద్ కుటుంబం. జూన్ 2 సాయంత్రం 5 గంటల నుంచి కాక్ టైల్ మెహందీ ఫంక్షన్ జరిగింది. ఇక జూన్ 3 ఉదయం 11.30 నిమిషాలకు పెళ్ళి కొడుకుగా ముస్తాబు చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఒకే ఒక జీవితంతో మరో సూపర్‌ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు శర్వా. ప్రస్తుతం యంగ్‌ డైరెక్టర్‌ శ్రీరామ్‌ ఆదిత్య డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..