Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV- Vyuham: ఏపీ పాలిటిక్స్‌లో హీట్‌ పెంచిన ఆర్జీవీ ‘వ్యూహం.’.. అన్ని నిజాలే ఉంటాయంటూ..

వ్యూహం పేరుతో కొత్త సినిమాను అనౌన్స్‌చేసి షూటింగ్‌ కూడా మొదలుపెట్టేశారు ఆర్జీవీ. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలోకి వదిలారు. ఇప్పుడీ ఫొటోలు సంచలనంగా మారాయ్‌. ఎందుకంటే, అవి ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతిరెడ్డి పాత్రలు. సీఎం జగన్‌గా అజ్మల్‌ నటిస్తుంటే... భారతి క్యారెక్టర్‌ను మానస పోషిస్తోంది

RGV- Vyuham: ఏపీ పాలిటిక్స్‌లో హీట్‌ పెంచిన ఆర్జీవీ 'వ్యూహం.'.. అన్ని నిజాలే ఉంటాయంటూ..
Rgv Vyuham
Follow us
Basha Shek

|

Updated on: Jun 02, 2023 | 1:43 PM

రామ్‌గోపాల్‌వర్మ… ఈ పేరే పెద్ద కాంట్రవర్సీ… ఎప్పుడేం చేస్తాడో… ఏమంటాడో ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ మీద కాంట్రవర్సీ లేపవడం వర్మ స్టైల్‌. ఒక్క మాటలో చెప్పాలంటే లోకమంతా ఒకవైపు ఉంటే… ఆర్జీవీ ఒక్కటే ఇంకోవైపు ఉంటాడు. అయినా, అందరూ చేసేదే ఆర్జీవీ చేస్తే ఆయన రాంగోపాలవర్మ ఎందుకవుతారు? పొగరనుకున్నా, తెగువనుకున్నా డోంట్‌ కేర్‌ అనే వర్మ… ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కల్లోలం రేపారు. వ్యూహం పేరుతో కొత్త సినిమాను అనౌన్స్‌చేసి షూటింగ్‌ కూడా మొదలుపెట్టేశారు ఆర్జీవీ. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలోకి వదిలారు. ఇప్పుడీ ఫొటోలు సంచలనంగా మారాయ్‌. ఎందుకంటే, అవి ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతిరెడ్డి పాత్రలు. సీఎం జగన్‌గా అజ్మల్‌ నటిస్తుంటే… భారతి క్యారెక్టర్‌ను మానస పోషిస్తోంది. సినిమాలోని క్యారెక్టర్స్‌తోపాటు స్టోరీ లైన్‌ కూడా ముందే చెప్పేశారు వర్మ. అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం అంటూ మూవీ ఎలా ఉండబోతోందో ముందే హింట్‌ ఇచ్చారు. ఆర్జీవీ అనౌన్స్‌ చేసిన వ్యూహం మూవీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హీట్‌ రేపుతోంది.

వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాలు ఎంత వివాదం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతకుమించి సంచలనం కాబోతోంది వ్యూహం మూవీ. వర్మ మాటలను డీకోడ్‌ చేస్తే అది క్లియర్‌గా తెలుస్తోంది. వైసీపీ ప్రత్యర్ధులపై సెటైరికల్‌గా సినిమా ఉండబోతున్నట్టు కనిపిస్తోంది. అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడే రామ్‌గోపాల్‌వర్మ.. ఈ సినిమాను మొత్తం సెటైర్లతో నింపేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే, రీసెంట్‌గా కూడా పవన్‌పై హాట్‌ కామెంట్స్‌ చేశారు ఆర్జీవీ. పవన్‌ హీరోగా పాపం పసివాడు సినిమా తీయాలంటూ సెటైర్లేశారు వర్మ. పవన్‌ టార్గెట్‌గా ఆర్జీవీ చేసిన ట్వీట్లూ, కామెంట్లూ.. ఏపీలో పెను సంచలనమే సృష్టించాయ్‌. ఇప్పుడు వ్యూహం సినిమా అంతకుమించి కలకలం రేపబోతోంది.

బయోపిక్‌ కాదు రియల్‌ పిక్‌..

వ్యూహం సినిమా బయోపిక్‌ కానే కాదంటున్నారు వర్మ. బయోపిక్‌ను మించిన రియల్‌ పిక్‌ అని చెబుతున్నారు. బయోపిక్‌లో అయినా అబద్ధాలు ఉంటాయేమో.. ఈ సినిమాలో మాత్రం అన్నీ నిజాలే ఉంటాయంటున్నారు. అసలు, వ్యూహం సినిమా ఎలా ఉండబోతోందో.. ఆర్జీవీ మాటల్లో ఒకసారి చూద్దాం.