AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2018 OTT: ఇట్స్‌ అఫిషియల్‌.. తెలుగు వెర్షన్‌లోనూ స్ట్రీమింగ్‌ కానున్న ‘2018’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?

మే 5న చిన్న సినిమాగా విడుదలైన 2018 బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమా దెబ్బకు మలయాళ సినిమా ఇండస్ట్రీ రికార్డులన్నీ వరదలో కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు సుమారు రూ.155 కోట్ల వసూళ్లను సాధించిన ఈ మూవీ ఇటీవలే తెలుగులోనూ విడుదలైంది.

2018 OTT: ఇట్స్‌ అఫిషియల్‌.. తెలుగు వెర్షన్‌లోనూ స్ట్రీమింగ్‌ కానున్న '2018'.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
2018 Movie
Basha Shek
|

Updated on: Jun 07, 2023 | 12:38 AM

Share

2018లో కేరళలో సంభవించిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన మలయాళ సినిమా 2018. వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తూ వర్సటైల్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటోన్న టొవినో థామస్‌ ఈ మూవీలో హీరోగా నటించాడు. అపర్ణా బాల మురళి, కుంచకో బోబన్‌, అసిఫ్‌ అలీ, వినీత్‌ శ్రీనివాసన్‌ కీలక పాత్రలు పోషించారు. జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించారు. మే 5న చిన్న సినిమాగా విడుదలైన 2018 బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమా దెబ్బకు మలయాళ సినిమా ఇండస్ట్రీ రికార్డులన్నీ వరదలో కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు సుమారు రూ.155 కోట్ల వసూళ్లను సాధించిన ఈ మూవీ ఇటీవలే తెలుగులోనూ విడుదలైంది. జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌ అధినేత బన్నీ వాస్ మే 26న ఈ సినిమాను తెలుగులో విడుదల చేశారు. 2018 సినిమాకు తెలుగు నాట కూడా భారీ వసూళ్లు వచ్చాయి. ఈ మూవీకి తెలుగులో మరిన్ని లాభాలు వచ్చే అవకాశముంది. అయితే ఇంతలోనే ఓటీటీ స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది.

ఇవి కూడా చదవండి

‘2018’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సోనీ లివ్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో జూన్ 7వ తేదీ నుంచే ఈ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే ముందుగా కేవలం మలయాళ వెర్షన్‌ను మాత్రమే స్ట్రీమింగ్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ‘2018’ సినిమాను మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది ఓటీటీ ప్లాట్‌ఫామ్‌. ఇది బన్నీ వాస్‌కు షాక్‌ అని చెప్పవచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి.

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి