- Telugu News Photo Gallery Viral photos Snake rescue expert Snake Naresh dies after bitten by captured cobra in chikkamagaluru
Snake Bite: పాపం.. పాములు పట్టే వ్యక్తి.. అదే పాము కాటుకు బలయ్యాడు.. హృదయవిదారకర ఘటన
చిక్ మంగళూరుకు చెందిన ప్రముఖ హెర్పెటాలజిస్ట్ స్నేక్ నరేష్‌ను పట్టుకున్న పామే కాటేసింది. దీంతో అతను అక్కడికక్కడే కన్నుమూశాడు. చిక్ మంగళూరు నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ హృదయవిదారకర ఘటన చోటుచేసుకుంది.
Updated on: May 30, 2023 | 8:35 PM

చిక్ మంగళూరుకు చెందిన ప్రముఖ హెర్పెటాలజిస్ట్ స్నేక్ నరేష్‌ను పట్టుకున్న పామే కాటేసింది. దీంతో అతను అక్కడికక్కడే కన్నుమూశాడు. చిక్ మంగళూరు నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ హృదయవిదారకర ఘటన చోటుచేసుకుంది.

2013లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నరేష్ జిల్లాలో వేలాది పాములను పట్టుకుని అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలేవాడు. పాముల సంరక్షణతో పాటు పాఠశాల విద్యార్థులకు పాముల పట్ల అవగాహన కల్పించేందుకు కృషి చేశారు.

పాము కాటువేయడంతో అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే స్థానికులు నరేష్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తూ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

మొదట వృత్తిరీత్యా టైలర్ అయిన స్నేక్ నరేష్ ప్రవృత్తితో పాములను పట్టుకునేవాడు. అయితే ఇప్పుడు అదే పాము కాటుకు బలవ్వడం దురదృష్టకరం. అతని వయసు 51 ఏళ్లు.