The Kerala Story: ఓటీటీ స్ట్రీమింగ్‏కు రెడీ అయిన ‘ది కేరళ స్టోరీ’.. ఎప్పటినుంచి చూడొచ్చంటే..

ఓవైపు పలు రాష్ట్రాల్లో ఈ సినిమాను బ్యాన్ చేసినప్పటికీ మిగతా ప్రాంతాల్లో మాత్రం భారీగా వసూళ్లు రాబడుతూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఇప్పటివరకు ది కేరళ స్టోరీ చిత్రం దాదాపు రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం థియేటర్లలో దిగ్విజయంగా దూసుకుపోతున్న ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతుంది.

The Kerala Story: ఓటీటీ స్ట్రీమింగ్‏కు రెడీ అయిన 'ది కేరళ స్టోరీ'.. ఎప్పటినుంచి చూడొచ్చంటే..
The Kerala Story
Follow us
Rajitha Chanti

|

Updated on: May 31, 2023 | 6:40 PM

ఎన్నో వివాదాల మధ్య థియేటర్లలో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన చిత్రం ది కేరళ స్టోరీ. విడుదలకు ముందే దేశవ్యాప్తంగా సెన్సెషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఓవైపు పలు రాష్ట్రాల్లో ఈ సినిమాను బ్యాన్ చేసినప్పటికీ మిగతా ప్రాంతాల్లో మాత్రం భారీగా వసూళ్లు రాబడుతూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఇప్పటివరకు ది కేరళ స్టోరీ చిత్రం దాదాపు రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం థియేటర్లలో దిగ్విజయంగా దూసుకుపోతున్న ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతుంది. తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ సినిమా జూన్ 23 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. తెలుగుతోపాటు.. తమిళం, హిందీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందట.

డైరెక్టర్ సుదీప్తో సేన్ తెరకెక్కించిన ఈ సినిమాలో అదా శర్మ ప్రధాన పాత్రలో నటించింది. అలాగే యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ కీలకపాత్రలలో నటించారు. కేరళలలో అమాయకులైన అమ్మాయిలను లవ్ జిహాద్ పేరుతో మతమార్పిడి చేసి వారిని ఐఎస్ఐఎస్ క్యాంపుల్లోకి పంపించి దేశ వ్యతిరేకులుగా మార్చారనే కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు. దీంతో ఈ సినిమాకు తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాతో ఆదా శర్మ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. హార్ట్ ఎటాక్ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఆదా శర్మ.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు సంపాదించలేకపోయింది. మొదటిసారి లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించిన ఈ బ్యూటీకి ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది.