AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్‏తో సినిమా అంటే అట్లుండాలి.. ‘ఉస్తాద్ భగత్‏సింగ్’ పై డైరెక్టర్ తేజ కామెంట్స్.. హరీష్ రియాక్షన్ వైరల్..

ముఖ్యంగా చాలాకాలంగా పవన్ మూవీస్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‏తో కేకలు పెట్టించింది టీజర్. ఇందులో మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో రఫ్పాడించేందుకు సిద్ధమవుతున్నారు పవన్. తాజాగా ఈ మూవీ టీజర్ పై డైరెక్టర్ తేజ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోపై డైరెక్టర్ హరీష్ శంకర్ సైతం రియాక్ట్ అయ్యారు.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్‏తో సినిమా అంటే అట్లుండాలి.. 'ఉస్తాద్ భగత్‏సింగ్' పై డైరెక్టర్ తేజ కామెంట్స్.. హరీష్ రియాక్షన్ వైరల్..
Teja, Pawan Kalyan
Rajitha Chanti
|

Updated on: May 31, 2023 | 2:53 PM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే బ్రో మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన పవన్ ప్రస్తుతం డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తోన్న చిత్రంలో నటిస్తున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాకు ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల విడుదలైన టీజర్ ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి. ముఖ్యంగా చాలాకాలంగా పవన్ మూవీస్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‏తో కేకలు పెట్టించింది టీజర్. ఇందులో మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో రఫ్పాడించేందుకు సిద్ధమవుతున్నారు పవన్. తాజాగా ఈ మూవీ టీజర్ పై డైరెక్టర్ తేజ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోపై డైరెక్టర్ హరీష్ శంకర్ సైతం రియాక్ట్ అయ్యారు.

చాలా కాలం తర్వాత డైరెక్టర్ తేజ రూపొందిస్తోన్న చిత్రం అహింస. ఇందులో దగ్గుబాటి అభిరామ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాతో అభిరామ్ హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ.. పవన్ కళ్యాణ్ మూవీస్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ కోసమైతే మీరు ఎలాంటి జోనర్ కథను సిద్ధం చేస్తారని ప్రశ్నించగా.. తేజ మాట్లాడుతూ.. ఇటీవల వచ్చిన ట్రైలర్ తనకు బాగా నచ్చిందని..పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే అట్లుండాలి.. ట్రైలర్ చూడగానే అర్థమైపోయింది సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని అని అన్నారు. ఇక తేజకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. హరీష్ శంకర్ స్పందించారు. ఆ వీడియోను ట్విట్టర్ వేదికగా రీట్వీట్ చేస్తూ థాంక్యూ తేజ గారు అంటూ కామెంట్ చేశారు.

ఇవి కూడా చదవండి

పవన్, హరీష్ శంకర్ కాంబోలో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్