Kamal Haasan: ‘నిజమైన కథ అని రాయగానే సరిపోదు’.. ది కేరళ స్టోరీ వివాదంపై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ సినిమాను నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే విడుదలకు ముందే ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న ఈ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కమల్ హాసన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ది కేరళ స్టోరీ వివాదంపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
ఓవైపు వివాదాలు.. మరోవైపు ప్రేక్షకాదరణతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న చిత్రం ది కేరళ స్టోరీ. డైరెక్టర్ సుదీప్తో సేన్ దర్శకత్వంలో హీరోయిన్ ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ భారీగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. 2023 మే 5న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఎన్నో విమర్శల మధ్యే మంచి విజయాన్ని అందుకుంది. ఇక తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ సినిమాను నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే విడుదలకు ముందే ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న ఈ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కమల్ హాసన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ది కేరళ స్టోరీ వివాదంపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
ది కేరళ స్టోరీ వివాదంపై మీ అభిప్రాయమేంటీ అని అడగ్గా.. కమల్ స్పందిస్తూ.. “నేను ఎప్పుడూ ఒకే మాట చెబుతాను. నాకు ప్రచార చిత్రాలు నచ్చవు. అలాంటి వాటికి పూర్తిగా నేను వ్యతిరేకిని. సినిమా టైటిల్ కింద నిజమైన కథ అని రాయగానే సరిపోదు. అలా రాసినంత మాత్రన అది నిజంగా జరిగిన కథ అవ్వదు” అని అన్నారు.
ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ది కేరళ స్టోరి చిత్రం. ఈ సందర్భంగా హీరోయిన్ ఆదా శర్మ తన ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. “దేశంలోని రెండు రాష్ట్రాలు ఈ చిత్రంపై నిషేదం విధించాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఇది నేను అస్సలు ఊహించలేదు. నా అంచనాలకు మించి ఈ చిత్రం విజయం సాధించింది” అంటూ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది.
“అన్ని అవాంతరాలు ఎదురైనా 7 సంవత్సరాలు తన పరిశోధనకు అండగా నిలిచినందుకు, సెట్‌లో మా అందరితో ఎంతో దయతో ప్రవర్తించారు.. అన్ని వాతావరణ పరిస్థితులు, కష్టాలలో తన ఆహ్లాదకరమైన స్వభావాన్ని కొనసాగించినందుకు సుదీప్తో సర్ కు ధన్యవాదాలు.” అని అన్నారు ఆదా శర్మ.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.