Allu Arjun: పుష్ప తర్వాత అల్లు అర్జున్ మూవీ ఎవరితో ?.. మరోసారి ఆ స్టార్ డైరెక్టర్‏కే బన్నీ ఛాన్స్ ..

బన్నీ కెరియర్ గ్రాఫ్‏ను అమాంతం పైకి లేపిందీ మూవీ. ఇందులో రష్మిక, సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించగా.. సమంత చేసిన స్పెషల్ సాంగ్ హైలెట్ అనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి సీక్వెల్‏గా రాబోతున్న పుష్ప 2పైనే ఇప్పుడు భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Allu Arjun: పుష్ప తర్వాత అల్లు అర్జున్ మూవీ ఎవరితో ?.. మరోసారి ఆ స్టార్ డైరెక్టర్‏కే బన్నీ ఛాన్స్ ..
Allu Arjun
Follow us
Rajitha Chanti

|

Updated on: May 24, 2023 | 3:14 PM

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేయడమే కాకుండా.. భారీగా వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా పుష్పరాజ్ పాత్రలో బన్నీ మేకోవర్, యాటిట్యూడ్‏ సినీప్రియులను కట్టిపడేసింది. బన్నీ కెరియర్ గ్రాఫ్‏ను అమాంతం పైకి లేపిందీ మూవీ. ఇందులో రష్మిక, సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించగా.. సమంత చేసిన స్పెషల్ సాంగ్ హైలెట్ అనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి సీక్వెల్‏గా రాబోతున్న పుష్ప 2పైనే ఇప్పుడు భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుండగా.. ఇటీవల విడుదలైన టీజర్ మరింత హైప్ క్రియేట్ చేసింది.

అయితే ఈ సినిమా షూటింగ్ ఓవైపు జరుగుతుండగా.. మరోవైపు బన్నీ తన నెక్ట్స్ మూవీస్ పై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఆయన తదుపరి చిత్రం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఉండనున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా ఆలస్యంగా స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం ప్రస్తుతం సందీప్ యానిమల్ మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేయాల్సి ఉంది. ఈ రెండు చిత్రాల తర్వాతే బన్నీ, సందీప్ కాంబో పట్టాలెక్కనుంది. అయితే ఏమాత్రం టైమ్ వేస్ట్ కాకుండా మరో సినిమాను షూరు చేయాలని ప్లాన్ చేస్తున్నారట బన్నీ.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలోనే తన నెక్ట్స్ మూవీ మాటల మంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్నాడని ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో గీత ఆర్ట్స్ సితార ఎంటర్టైన్మెంట్స్ లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది వేసవిలో ఈ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బన్నీ మాస్ యాంగిల్ చూపించాలని అనుకుంటున్నారట త్రివిక్రమ్. ఇక ఇందులో గోల్డెన్ బ్యూటీ సంయుక్త కథానాయికగా నటించనున్నట్లు టాక్. ఇక ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ