AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: జైశ్రీరామ్.. ఆదిపురుష్ నుంచి పవర్ ఫుల్ సాంగ్ రిలీజ్.. రోమాలు నిక్కబొడుచుకునేలా వీడియో

రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందించిన ఈ మూవీలో ప్రభాస్ తొలిసారిగా రాముడిగా కనిపించనుండగా.. సీతగా కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మూవీపై అంచనాలను మరింత పెంచేసింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి జైశ్రీరామ్ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.

Adipurush: జైశ్రీరామ్.. ఆదిపురుష్ నుంచి పవర్ ఫుల్ సాంగ్ రిలీజ్.. రోమాలు నిక్కబొడుచుకునేలా వీడియో
Prabhas
Rajitha Chanti
|

Updated on: May 20, 2023 | 3:16 PM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయన నటించిన ఆదిపురుష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించిన ఈ మూవీ జూన్ 16న ఆడియన్స్ ముందుకు రానుంది. తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందించిన ఈ మూవీలో ప్రభాస్ తొలిసారిగా రాముడిగా కనిపించనుండగా.. సీతగా కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మూవీపై అంచనాలను మరింత పెంచేసింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి జైశ్రీరామ్ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.

జైశ్రీరామ్ అనే మహిమాన్విత మంత్ర నామాన్ని ఓ రేంజ్ లో ప్లాన్ చేసిన మొదటి సాంగ్ నుంచి ఇప్పుడు ఫుల్ వెర్షన్ బయటకి వచ్చింది. తాజాగా విడుదలైన ఈ సాంగ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, అజయ్ అతుల్ సంగీతం ప్రభాస్ ప్రెజెన్స్ ఓంరౌత్ విజన్ తో ఈ సాంగ్ సెన్సేషనల్ హిట్ అవ్వడం ఖాయం అని చెప్పొచ్చు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ శ్రోతలను ఆకట్టుకోవడమే కాదు.. సినిమా ఏరేంజ్ లో ఉండబోతుందో చెప్పకనే చెప్పింది.

ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్ పై రూ. 600 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా రన్ టైం 2 గంటల 54 నిమిషాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈమూవీ సెన్సార్ కు వెళ్లనుంది. ఇందులో సన్నీ సింగ్ హనుమంతుడిగా కనిపించనున్నారు. ఈ సినిమాను తెలుగులో యూవీ క్రియేషన్స్ రిలీజ్ చేయబోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?