AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aishwarya Rajesh: ‘రష్మికను కించపరచలేదు.. నా మాటలను తప్పుగా తీసుకున్నారు’.. ఐశ్వర్య రాజేశ్ క్లారిటీ..

పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాత్ర తనకు వచ్చి ఉంటే బాగుండు అని.. ఆ పాత్ర తనకు సరిగ్గా సెట్ అవుతుందంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఐశ్వర్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. రష్మిక కంటే తాను ఇంకా బాగా నటించేదాన్ని అంటూ ఆమె చెప్పినట్లుగా రూమర్స్ సైతం వ్యాపించాయి.

Aishwarya Rajesh: 'రష్మికను కించపరచలేదు.. నా మాటలను తప్పుగా తీసుకున్నారు'.. ఐశ్వర్య రాజేశ్ క్లారిటీ..
Aishwarya Rajesh
Rajitha Chanti
| Edited By: |

Updated on: May 18, 2023 | 3:39 PM

Share

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ సంపాదించుకుంది నేషనల్ క్రష్. ప్రస్తుతం ఈ మూవీ సిక్వెల్ చిత్రీకరణలో పాల్గొంటుంది. అయితే ఇటీవల తన కొత్త సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ శ్రీవల్లి పాత్ర గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాత్ర తనకు వచ్చి ఉంటే బాగుండు అని.. ఆ పాత్ర తనకు సరిగ్గా సెట్ అవుతుందంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఐశ్వర్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. రష్మిక కంటే తాను ఇంకా బాగా నటించేదాన్ని అంటూ ఆమె చెప్పినట్లుగా రూమర్స్ సైతం వ్యాపించాయి. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపాయి. దీంతో తాను చేసిన కామెంట్స్ పై వివరణ ఇస్తూ.. ఓలేఖ విడుదల చేసింది హీరోయిన్ ఐశ్వర్య. తన మాటలను తప్పుగా తీసుకున్నారని.. రష్మికను కించపరుస్తూ నేను మాట్లాడలేదంటూ క్లారిటీ ఇచ్చింది.

“ఇటీవల నేను తెలుగులో సినిమాల్లో ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నాను అని ఓ ఇంటర్వ్యూలో నన్ను అడిగారు. అందుకు నేను మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్రమ అంటే నాకు చాలా ఇష్టమని.. అవకాశాలు వస్తే నటించేందుకు రెడీగా ఉన్నానని చెప్పాను. పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాత్ర నాకు బాగా నచ్చిందని.. ఆ పాత్ర నాకు సరిగ్గా సెట్ అవుతుందని చెప్పాను. కానీ నా మాటలను తప్పుగా తీసుకున్నారు. నేను రష్మికను కించపరుస్తూ మాట్లాడినట్లుగా రూమర్స్ వైరలవుతున్నాయి. కానీ రష్మిక నటన గురించి తప్పుగా మాట్లాడలేదు. నిజానికి రష్మికతోపాటు.. నా తోటి నటీనటులందరిపై నాకు ప్రగాఢమైన అభిమానం ఉంటుంది. దయచేసి ఇలాంటి అసత్యపు వార్తలను వ్యాప్తి చేయకండి” అంటూ రిక్వెస్ట్ చేసింది ఐశ్వర్య.

ఇవి కూడా చదవండి
Aishwarya

Aishwarya

ఐశ్వర్య ఇటీవల ఫర్హానా చిత్రంలో నటించింది. మే 12న విడుదలైన ఈ సినిమాకు మిక్డ్స్ రివ్యూ వచ్చింది. తెలుగులో టక్ జగదీశ్, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి చిత్రాల్లో నటించింది. ఇటీవల ఐశ్వర్య ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అలాగే.. తనకు తెలుగులో మంచి అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తానని తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.