Siva Balaji: జాతకాలు కుదరలేదని మధుమితకు బ్రేకప్ చెప్పిన శివబాలాజీ.. కానీ చివరకు..

వీరిద్దరు 2004లో ఇంగ్లీష్ కారన్ మూవీలో కలిసి నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దాదాపు నాలుగేళ్లు ప్రేమలో ఉన్న వీరిద్దరు ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే తమ వివాహం అంత ఈజీగా కాలేదని... ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని.. పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యాక.. శివ బాలాజీ బ్రేకప్ చెప్పాడని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.

Siva Balaji: జాతకాలు కుదరలేదని మధుమితకు బ్రేకప్ చెప్పిన శివబాలాజీ.. కానీ చివరకు..
Siva Balaji, Madumitha
Follow us
Rajitha Chanti

| Edited By: seoteam.veegam

Updated on: May 18, 2023 | 3:42 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్యూట్ కపుల్స్‏లో నటుడు శివ బాలాజీ, నటి మధుమిత జంట ఒకటి. ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ సినిమాతో తెరంగేట్రం చేసిన శివ బాలాజీ.. ఆ తర్వాత ఎలా చెప్పను, దోస్త్, ఆర్య సినిమాల్లో నటించాడు. ఆర్య సినిమాతో అతనికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషించిన ఆయన.. 2009లో సహనటి మధుమితను పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరిద్దరు 2004లో ఇంగ్లీష్ కారన్ మూవీలో కలిసి నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దాదాపు నాలుగేళ్లు ప్రేమలో ఉన్న వీరిద్దరు ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే తమ వివాహం అంత ఈజీగా కాలేదని… ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని.. పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యాక.. శివ బాలాజీ బ్రేకప్ చెప్పాడని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.

ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మధుమిత మాట్లాడుతూ.. “దాదాపు నాలుగేళ్లపాటు మేం ప్రేమలో ఉన్నాం. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాం. ఇంట్లో వాళ్లు కూడా ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఒకరోజు శివ బాలాజీ ఫోన్ చేసి మనకు సెట్ అవ్వదు.. జాతకాలు కుదరడం లేదు.. మనం పెళ్లి చేసుకుంటే మా అమ్మ చనిపోతుందట అని చెప్పాడు. ఆ క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఓకే అని చెప్పి గట్టిగా ఏడ్చేశాను. మనం ఫ్రెండ్స్ గా ఉందామని చెప్పాడు.. నేను నో చెప్పాను. ఎందుకంటే అతన్ని భర్తగా ఊహించుకున్నాను. మా ఇంట్లోవాళ్లు జాతకాలు పెద్దగా పట్టించుకోరు. కానీ అత్తమ్మ వాళ్లు జాతకాలను నమ్ముతారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత మళ్లీ బాలాజీ టచ్ లోకి వచ్చాడు. పెళ్లి చేసుకుందామని చెప్పాడు. అప్పుడు జాతకాలు చూపిస్తే.. బాగున్నాయని చెప్పారు. అప్పుడు మా పెళ్లి జరిగింది” అంటూ చెప్పుకొచ్చింది.

ఇక శివబాలాజీ మాట్లాడుతూ.. మధుమితకు బ్రేకప్ చెప్పిన తర్వాత చాలా బాధపడ్డానని.. ఏడాది చూసి.. అప్పటివరకు ఆమె పెళ్లి చేసుకోకపోతే ఎలాగైనా ఇంట్లో వాళ్లని ఒప్పిద్దామనుకున్నాడట. ఆమెకు ఎన్ని సంబంధాలు వస్తున్నా రిజెక్ట్ చేస్తుందని తెలిసి.. మా ఎలక్షన్స్ సమయంలో మధుమితను కలిస్తే తను మాట్లాడలేదని.. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు.వీరికి ఇద్దరు అబ్బాయిలు ఉండగా.. శివ బాలాజీ సినిమాల్లో కొనసాగుతుండగా.. మధుమిత సొంతంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?