Adah Sharma: ‘నా నిజాయితీని కొందరు అపహాస్యం చేశారు’.. ది కేరళ స్టోరీ మూవీపై ఆదా శర్మ ట్వీట్..
ఈ సినిమాతో ఆదా శర్మ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇందులో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఈ సినిమాను బ్యాన్ చేసినప్పటికీ మిగతా చోట్ల మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో తాజాగా ది కేరళ స్టోరీ విజయం పై ఆసక్తికర ట్వీట్ చేసింది ఆదా శర్మ.
దేశవ్యాప్తంగా వివాదాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్న సినిమా ది కేరళ స్టోరీ. డైరెక్టర్ సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది. ఇందులో ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటించింది. లవ్ జిహాద్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మే 5న రిలీజ్ అయ్యి ఇప్పటివరకు రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. కేరళలో కొన్నేళ్లుగా 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడనే ఇతివృత్తంతో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాతో ఆదా శర్మ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇందులో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఈ సినిమాను బ్యాన్ చేసినప్పటికీ మిగతా చోట్ల మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో తాజాగా ది కేరళ స్టోరీ విజయం పై ఆసక్తికర ట్వీట్ చేసింది ఆదా శర్మ.
“కొందరు నా నిజాయితీని అపహాస్యం చేశారు. నా చిత్తశుద్ధిని చులకనగా చూశారు. ది కేరళ స్టోరీ టీజర్ వచ్చాక ఈ సినిమాను విడుదల చేయొద్దని బెదిరింపులు వచ్చాయి. కొన్ని రాష్ట్రాలు ఏకంగా దీనిపై నిషేదం విధించాయి. సినిమాకు వ్యతిరేకంగా ఎన్నో ప్రచారాలు చేశారు. కానీ ప్రేక్షకులు ఈ సినిమాకు అఖండ విజయాన్ని అందించారు. ఒక మహిళ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను ఇంతగా ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా విషయంలో ప్రేక్షకులు గెలిచారు. ఇప్పుడు మేము అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాం” అని తెలిపింది.
Discrediting my sincerity, mocking my integrity , threats , Our teaser getting shadow banned,the movie getting banned in certain states,slander campaigns launched…BUT you ,the audience made #TheKeralaStory the no1 female lead movie first week of all time !!wowww! Audience aap… pic.twitter.com/yxZhTSRq8G
— Adah Sharma (@adah_sharma) May 13, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.