AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Antony: ఇంటర్వ్యూ చేయడానికి వచ్చి లవ్ ప్రపోజ్ చేసిన జర్నలిస్ట్.. తొలిచూపుకే ప్రేమలో పడిపోయిన హీరో.. 

కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఈనెల 19న తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. తమిళనాడులోని ప్రధాన నగరాలతోపాటు.. హైదరాబాద్‏లో మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు చిత్రయూనిట్. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం హీరో విజయ్ ఆంటోని లవ్ స్టోరీ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

Vijay Antony: ఇంటర్వ్యూ చేయడానికి వచ్చి లవ్ ప్రపోజ్ చేసిన జర్నలిస్ట్.. తొలిచూపుకే ప్రేమలో పడిపోయిన హీరో.. 
Vijay Antony, Fathima
Rajitha Chanti
|

Updated on: May 13, 2023 | 11:06 AM

Share

2016లో ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనం సృష్టించిన సినిమా బిచ్చగాడు. తమిళ్ హీరో విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. మరో విషయమేంటంటే.. ఈ మూవీకి ఆయనే దర్శకత్వం వహించగా.. ఆయన సతీమమి ఫాతిమా నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాతో తమిళంలోనే కాదు.. ఇటు తెలుగులోనూ ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రెడీ అయ్యింది. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఈనెల 19న తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. తమిళనాడులోని ప్రధాన నగరాలతోపాటు.. హైదరాబాద్‏లో మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు చిత్రయూనిట్. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం హీరో విజయ్ ఆంటోని లవ్ స్టోరీ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

విజయ్ ఆంటోని.. తమిళనాడులో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా హీరోగా అడుగుపెట్టి సక్సెస్ అయ్యాడు. జీవితంలో ఎన్నో కష్టాలను దాటుకుని.. సినీపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విజయ్ చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోయాడు. విజయ్ తల్లి తన పిల్లల్ని చదివించడానికి కుటుంబాన్ని పోషించడానికి అనేక కష్టాలు పడ్డారు. ఓపక్క ఉద్యోగం చేసుకుంటూనే.. మరోవైపు పిల్లల్ని చూసుకునేవారు. జీవితంలో అనేక కష్టాలను చూసిన విజయ్.. ఎలాంటి సపోర్ట్ లేకపోయినా.. సినీపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

అయితే విజ్య వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన పెళ్లి చేసుకుంది.. తనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన ఓ జర్నలిస్ట్ ను. ఆమె పేరే ఫాతిమా. ఓ సినిమా సక్సెస్ మీట్ లో ఆయనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది ఫాతిమా. తొలిచూపులోనే ప్రేమలో పడిపోయింది. అంతే… అదే విషయాన్ని నేరుగా చెప్పేస్తూ.. ప్రపోజ్ చేసిందట. ఆమె మొదటి చూపులకే కనెక్ట్ అయిన విజయ్… ఫాతిమాతో ప్రేమలో పడిపోయారు. ఆ తర్వాత ఇరువురి కుటుంబసభ్యుల సమక్షంలో వీరిద్దరి వివాహం జరిగింది. 2006లో వీరి వివాహం జరగ్గా.. వీరికి లారా అనే కూతురు ఉంది. ప్రస్తుతం విజయ్.. బిచ్చగాడు 2 ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.