- Telugu News Photo Gallery Cinema photos Parineeti chopra to swara bhaskar bollywood actress who fall in love with politicians in telugu
Actress Politician Love: పరిణీతి చోప్రా నుండి జెనీలియా వరకూ.. పొలిటికల్ లీడర్స్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న బ్యూటీస్ ఎవరంటే
నటి పరిణీతి చోప్రా ఈ రోజు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో నిశ్చితార్థం చేసుకోనున్నారు. అయితే బాలీవుడ్ బ్యూటీలు రాజకీయ నాయకులతో ప్రేమలో పడటం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందుకూడా పలువురు నటీమణులు రాజకీయ నాయకుడిని వివాహం చేసుకున్నారు.
Updated on: May 13, 2023 | 11:38 AM

గత కొన్ని రోజులుగా పరిణీతి-రాఘవ్ కలిసి సందడి చేస్తున్నారు. ముంబైలో రాఘవ్ చద్దాతో డిన్నర్ డేట్‌లో పరిణీతి కనిపించడం చూసిన తర్వాత వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ బీ టౌన్ లో వార్తలు వినిపించాయి. ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోవచ్చని ఊహాగానాలు వ్యాపించాయి. పరిణీతి, రాఘవ్ లండన్ స్కూల్లో కలిసి చదువుకున్నారు.

అదే సమయంలో, నటి స్వర భాస్కర్ కూడా సమాజ్ వాదీ పార్టీ నాయకుడికి ప్రేమించింది. స్వర భాస్కర్ ఈ ఏడాది ఫహద్ అహ్మద్‌ను వివాహం చేసుకుంది. ముందుగా రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. తర్వాత ఈ జంట మొదట హిందూ, ముస్లిం సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు.

స్వరా, ఫహద్ ఒక నిరసన సమయంలో కలుసుకున్నారు. అనంతరం వీరిద్దరి మధ్య పరిచయం చర్చలు, సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదట్లో స్వరా ఫహద్‌ని స్నేహితుడుగా మాత్రమే అని చెప్పేది. అయితే జనవరి 6న వారిద్దరూ పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు.

టార్జాన్ ది వండర్ కార్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నటి అయేషా టాకియా కూడా ఓ రాజకీయ నాయకుడి కుమారుడిని వివాహం చేసుకుంది. ఆయేషా సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అబూ అజ్మీ కుమారుడు ఫర్హాన్ ఆజ్మీని ప్రేమించింది. ఇద్దరూ 2009లో పెళ్లి చేసుకున్నారు.

బొమ్మరిల్లు, హ్యాపీ వంటి సినిమాల్లో అల్లరిపిల్లగా నటించి ఆకట్టుకున్న జెనీలియా నటుడు రితేష్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. రితేష్ దేశ్ ముఖ్ నాయకుడు విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కుమారుడు..బాలీవుడ్ నటుడు

ఒకప్పటి తెలుగు నటి నవనీత్ కౌర్ రానా స్వతంత్ర ఎమ్మెల్యే రవి రానాను వివాహం చేసుకున్నారు. వారు ఫిబ్రవరి 3, 2011న మహారాష్ట్రలోని అమరావతిలో సామూహిక వివాహం చేసుకున్నారు. నవనీత్ మరియు రవి ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు

రాధికా కుమారస్వామి- హెచ్‌డి కుమారస్వామి కన్నడ స్టార్ రాధికా కుమారస్వామి 2006లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామిని వివాహం చేసుకున్నారు.





























