Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepika Padukone: చూడటానికి సింపుల్‌గానే కనిపించింది.. కానీ, ఆమె చేతికున్న వాచీతో లగ్జరీ ఇల్లే కొనచ్చు..

కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా దీపికాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. అదెంటంటే.. ఆమె ధరించిన వాచీ ధర. అవును.. ఆ వాచ్ ప్రైజ్ మనీతో ఏకంగా ఓ లగ్జరీ ఇళ్లే కొనేయొచ్చు.

Deepika Padukone: చూడటానికి సింపుల్‌గానే కనిపించింది.. కానీ, ఆమె చేతికున్న వాచీతో లగ్జరీ ఇల్లే కొనచ్చు..
Deepika
Follow us
Rajitha Chanti

| Edited By: seoteam.veegam

Updated on: May 18, 2023 | 6:54 PM

దీపికా పదుకొణె.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటీఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్. అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా పాగా వేసిన ఈ ముద్దుగుమ్మ.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరో రణ్వీర్ కపూర్ తో పెళ్లి తర్వాత కూడా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఇప్పటివరకు హిందీలో నటించిన దీపికా.. ఇప్పుడు తొలిసారి తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ప్రాజెక్ట్ కె చిత్రంలో దీపికా కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాల మధ్య డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్, దిశా పటాని కీలకపాత్రలలో నటిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా దీపికాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. అదెంటంటే.. ఆమె ధరించిన వాచీ ధర. అవును.. ఆ వాచ్ ప్రైజ్ మనీతో ఏకంగా ఓ లగ్జరీ ఇళ్లే కొనేయొచ్చు.

ఇటీవల విమానాశ్రయంలో ఎంతో సింపుల్ గా కనిపించింది దీపికా.. కానీ ఆమె.. లగ్జరీ బ్రాండ్ అయిన కార్టియర్ నుంచి అద్భుతమైన PANTHRE DE CARTIER వాచ్ ధరించింది. దీనిని దాదాపు 18 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. ఇందులో రోమన్ సంఖ్యలు సమయాన్ని తెలియజేయడమే కాకుండా.. లోపల నీలరంగు వెండి ముళ్లులను అమర్చారు.లోపలి రింగ్ చుట్టూ ఉన్న నిమిషాల గుర్తులు వాచ్ అందాన్ని మరింత పెంచాయి. ఈ వాచ్ వాటర్ ప్రూఫ్. అయితే దీని ధర ఎంతంటే.. 26.500 USD. అంటే సుమారు… రూ. 21,65,000. దాదాపు 20 లక్షలకు పైమాటే. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

అయితే దీపికాకు వాచీలు అంటే అమితమైన ఇష్టం. ఇప్పటివరకు ఆమె వద్ద ఉన్న హయ్యేస్ట్ ప్రైజ్ వాచీలలో కార్టియర్ ఒకటి. ప్రస్తుతం దీపికా ప్రాజెక్ట్ కె మాత్రమే కాకుండా.. ఫైటర్ చిత్రంలోనూ నటిస్తుంది. డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్, అనిల్ కపూర్ నటిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.