AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paruchuri Gopalakrishna: ఎన్టీఆర్ సినిమాపై పరుచూరి ఆసక్తికర కామెంట్స్.. రీరిలీజ్ చేసినా 100 రోజులు ఆడుతుందని..

ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆయన ఆ సినిమా గురించి మాట్లాడారు.. ఈ సినిమా విడుదలై 72 సంవత్సరాలు పూర్తయిందని... ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కు చాలా మంది అభిమానులయ్యారని అన్నారు. ఈ సందర్భంగా పరుచూరి పలుకుల్లో భాగంగా మాట్లాడుతూ.. కేవిరెడ్డి, బి.నాగిరెడ్డి, చక్రపాణి వీళ్లంతా గొప్పవాళ్లని కొనియాడారు.

Paruchuri Gopalakrishna: ఎన్టీఆర్ సినిమాపై పరుచూరి ఆసక్తికర కామెంట్స్.. రీరిలీజ్ చేసినా 100 రోజులు ఆడుతుందని..
Paruchuri
Rajitha Chanti
|

Updated on: May 10, 2023 | 3:44 PM

Share

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ ఏ స్థాయిలో జరుగుతుందో తెలిసిందే. ఒకప్పుడు సూపర్ హిట్స్ మాత్రమే కాకుండా.. డిజాస్టర్స్ సైతం మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీగా వసూళ్లు రాబడుతున్నాయి.. దీంతో రోజు రోజుకీ రీరిలీజ్ ట్రెండ్ జోరుగా నడుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఆరెంజ్, బిల్లా, జల్సా, ఒక్కడు, దూకుడు వంటి చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సందర్భంగా మే 20న సింహాద్రి సినిమా 4కె వెర్షన్లో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఇప్పటినుంచే సంబరాలు స్టార్ట్ చేశారు అభిమానులు. ఇదిలా ఉండే.. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ నందమూరి తారకరామరావు (సీనియర్ ఎన్టీఆర్) నటించన పాతాళ భైరవి సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆయన ఆ సినిమా గురించి మాట్లాడారు.. ఈ సినిమా విడుదలై 72 సంవత్సరాలు పూర్తయిందని… ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కు చాలా మంది అభిమానులయ్యారని అన్నారు. ఈ సందర్భంగా పరుచూరి పలుకుల్లో భాగంగా మాట్లాడుతూ.. కేవిరెడ్డి, బి.నాగిరెడ్డి, చక్రపాణి వీళ్లంతా గొప్పవాళ్లని కొనియాడారు. మళ్లీ రీరిలీజ్ చేసినా 100 రోజులు ఆడగలిగిన సినిమాల జాబితాలో పాతాళ భైరవి ముందుంటుందన్నారు. ఆ చిత్రం అప్పట్లో అద్భుతమని చెప్పారు. ధైర్యే సాహసే లక్ష్మి ఈ ఒక్క పాయింట్ తీసుకుని దర్శకనిర్మాతలు ప్రభంజనాన్ని సృష్టించారన్నారు. అప్పటివరకు జానపతద సినిమాలంటే నాగేశ్వరరావు గుర్తొచ్చేవారని.. కానీ పాతాల భైరవి తర్వాత జానపదం ఎన్టీఆర్ అనేలా ప్రభావం చూపారని తెలిపారు. సాంఘికం, జానపదం, చారిత్రకం, పౌరాణికం.. ఇలా ఎలాంటి దానిలోనైనా ఎన్టీఆర్ జీవించేవారని అన్నారు. ఈ సినిమాను ఎన్నిసార్లు చూసినా.. ఏదో కొత్తదనం కనిపిస్తుందని అన్నారు.

ఇవి కూడా చదవండి

అలాగే ఈ సినిమాలోని సంభాషణలు.. ప్రత్యేక ఆకర్షణ అని.. ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయన్నారు. ప్రతి డైలాగులోనూ ప్రత్యేకత ఉంటుందన్నారు. మాంత్రికుడిగా యస్ వి. రంగారావుని చూస్తే భయమేసేదని.. ఆ సినిమాలోని వారంత పాత్రలలో ఒదిగిపోయి వాటికి జీవం పోశారన్నారు. తర్వాత రాబోయే జానపద చిత్రాలకు పాతాళ భైరవి ఓ మైలురాయని అన్నారు. ఈ సినిమాను ఓటీటీలో ఉంటే అందరూ చూడాలని పరుచూరి కోరారు.