Prabhas : ఒక్క వీడియోతో అంచనాలను పెంచేసిన ప్రభాస్.. విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఆదిపురుష్..

డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తోన్న ఆదిపురుష్. దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడె సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగా నిన్న ఈ మూవీ ట్రైలర్ ఏఎంబీ సినిమాస్ థియేటర్లో అభిమానుల మధ్య రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

Prabhas : ఒక్క వీడియోతో అంచనాలను పెంచేసిన ప్రభాస్.. విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఆదిపురుష్..
Adipurush
Follow us

| Edited By: seoteam.veegam

Updated on: May 18, 2023 | 6:56 PM

చాలా కాలంగా నిరాశలో ఉన్న అభిమానులలో ఒక్క వీడియోతో ఫుల్ జోష్ నింపాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. సాహో, రాధేశ్యామ్ వంటి డిజాస్టర్స్ తర్వాత ఇప్పుడు ఆదిపురుష్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటివరకు పాన్ ఇండియా స్టార్‏గా ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రభాస్.. ఇప్పుడు నేరుగా హిందీలో ఓ మూవీ చేస్తున్నాడు. అదే డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తోన్న ఆదిపురుష్. దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడె సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగా నిన్న ఈ మూవీ ట్రైలర్ ఏఎంబీ సినిమాస్ థియేటర్లో అభిమానుల మధ్య రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన ట్రైలర్ అదిరిపోయింది. ఎన్నో విమర్శల మధ్య వచ్చిన ఈ ట్రైలర్ సినిమాపై హైప్ పెంచేసింది. నిన్న మొన్నటివరకు ఈ సినిమా టీజర్ పై విమర్శలు చేసినవారే ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు.

రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా.. కృతి సనన్ సీతగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా గతంలో విడుదలైన టీజర్ పై అనేక విమర్శలు వచ్చాయి. రాముడు, రావణుడి పాత్రల కాస్ట్యూమ్స్, వీఎఫ్ఎక్స్ పై దారుణంగా కామెంట్స్ చేశారు. అంతేకాకుండా.. చిత్రయూనిట్ పై ఫిర్యాదులు కూడా వచ్చాయి. దీంతో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేస్తూ.. వీఎఫ్ఎక్స్ మార్పులు చేపట్టింది చిత్రూయనిట్. ఇప్పుడు గ్రాఫిక్స్ రీవర్క్ చేసి ట్రైలర్ రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో ఊహించని రెస్పాన్స్ వస్తుంది. ఒక్క ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచడమే కాకుండా.. ఈ చిత్రం హక్కుల కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడేలా చేసింది.

ఆదిపురుష్ ట్రైలర్ తో ప్రభాస్ లెక్కలు మార్చేశాడని చెప్పొచ్చు. మొదటిసారి ప్రభాస్ రాముడిగా కనిపించబోతుండడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని టీసిరీస్ బ్యానర్ పై నిర్మి్స్తున్నారు. ఇవే కాకుండా సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles