Rana-Miheeka Daggubati: ప్రెగ్నెన్సీ రూమర్స్ పై స్పందించిన మిహికా.. సినిమాల్లోకి వచ్చే ఆలోచనే లేదంట..

కొంతకాలం నుంచి రానా తండ్రి కాబోతున్నాడని.. ఈ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే అప్పుడే ఈ రూమర్స్ పై మిహికా స్పందించి క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో కొన్నాళ్ల ముందు మిహీక నుంచి ఓ గుడ్ న్యూస్ రాబోతుందంటూ రానా చెప్పాడు. దీంతో మరోసారి ప్రెగ్నెన్సీ వార్తలు తెరపైకి వచ్చాయి.

Rana-Miheeka Daggubati: ప్రెగ్నెన్సీ రూమర్స్ పై స్పందించిన మిహికా.. సినిమాల్లోకి వచ్చే ఆలోచనే లేదంట..
Rana, Miheeka
Follow us

| Edited By: seoteam.veegam

Updated on: May 18, 2023 | 7:19 PM

లీడర్ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమై.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రానా. మొదటిసినిమాతోనే ప్రశంసలు అందుకున్న ఈ హీరో.. ఆ తర్వాత ప్రధానపాత్రలే కాదు.. విలనిజంలోనూ అదరగొట్టారు. జక్కన్న తెరకెక్కించిన బాహుబలి సినిమాలో భల్లాలదేవగా మెప్పించారు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే ఇంటిరియర్ డిజైనర్ మిహికా బజాజ్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు రానా. వీరి పెళ్లి జరిగి దాదాపు మూడేళ్లు అవుతుంది. అయితే కొంతకాలం నుంచి రానా తండ్రి కాబోతున్నాడని.. ఈ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే అప్పుడే ఈ రూమర్స్ పై మిహికా స్పందించి క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో కొన్నాళ్ల ముందు మిహీక నుంచి ఓ గుడ్ న్యూస్ రాబోతుందంటూ రానా చెప్పాడు. దీంతో మరోసారి ప్రెగ్నెన్సీ వార్తలు తెరపైకి వచ్చాయి.

గత నాలుగైదు రోజుల నుంచి వీరిద్దరి గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే ఇటీవల ఓ లైఫ్ స్టైల్ ఈవెంట్లో పాల్గొన్న మిహీక ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించింది.”పెళ్లి తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నాను. రానా నా నుంచి సర్ ప్రైజింగ్ న్యూస్ వస్తుందని ఎందుకు చెప్పారో నాకు తెలియదు. నిజంగానే దాని గురించి రానాగారినే ఆడగాలి. అలాగే నేను ప్రెగ్నెంట్ కాదు. పెళ్లి తర్వాత కాస్త బొద్దుగా అయ్యాను. అది చూసి ప్రెగ్నెంట్ అనుకుంటున్నారు. అందులో ఏమాత్రం నిజం లేదు.. ఒకవేళ నిజంగా ప్రెగ్నెంట్ అయితే కచ్చితంగా అందరికీ ఆ విషయం చెబుతాను” అని అన్నారు.

ఇవి కూడా చదవండి

పెళ్లికి ముందే ఆమెకు డ్యూడ్రాప్ డిజైన్ స్టూడియో అనే ఇంటీరియర్ డెకరేషన్ కంపెనీ ఉంది. మిహీకా ఏమాత్రం సినీరంగానికి సంబంధం లేని వ్యక్తి. అయితే తనకు సినిమాలోకి వచ్చే ఆలోచన లేదని.. ప్రస్తుతం తన బిజినెస్ పనులతోనే సరిపోతుందని అన్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల రానా నాయుడు వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి అడుగుపెట్టారు రానా.

View this post on Instagram

A post shared by Miheeka Daggubati (@miheeka)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.