Salman Khan: ఒక్క యాక్షన్ ఫైట్ కోసం రూ. 35 కోట్లు.. సల్మాన్, షారుఖ్ కాంబో కోసం భారీగానే ప్లాన్ చేస్తున్నారుగా..
ఫస్ట్ పార్ట్ 2012లో.. ఆ తర్వాత సీక్వెన్స్ 2017లో టైగర్ జిందా హై పేరుతో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈరెండు పార్ట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా. రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. ఇక ఇప్పుడు రూపొందుతున్న టైగర్ 3లో సల్మాన్ ఖాన్ తోపాటు.. షారుఖ్ సైతం నటిస్తుండడం విశేషం.
ఇటీవలే కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించగా.. విక్టరీ వెంకటేశ్, భూమిక కీలకపాత్రలలో కనిపించారు. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టారు సల్లూభాయ్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం టైగర్ 3. ఇదివరకు రిలీజ్ అయిన టైగర్ రెండు పార్ట్స్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు థర్డ్ పార్ట్ తెరకెక్కుతుంది. ఏక్ థా టైగర్ తో ఈ టైగర్ సీక్వెన్స్ స్టార్ట్ అయ్యింది.
ఫస్ట్ పార్ట్ 2012లో.. ఆ తర్వాత సీక్వెన్స్ 2017లో టైగర్ జిందా హై పేరుతో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈరెండు పార్ట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా. రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. ఇక ఇప్పుడు రూపొందుతున్న టైగర్ 3లో సల్మాన్ ఖాన్ తోపాటు.. షారుఖ్ సైతం నటిస్తుండడం విశేషం. చాలా కాలం తర్వాత ఇద్దరూ సూపర్ స్టార్స్ కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై హైప్ వచ్చేసింది. ఇక లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో యాక్షన్స్ సీన్స్ ఎక్కువగా ఉండబోతున్నాయట. ముఖ్యంగా వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ కోసమే నిర్మాత ఏకంగా రూ. 35 కోట్లు ఖర్చు చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఒక్క సెట్ కోసమే రూ. 35 కోట్లు పెట్టడానికి ఓకే అన్నారట.
ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తుండగా.. ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్వవహరిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ మే 8న రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. సల్మాన్ సరసన కత్రినా కైఫ్ నటిస్తోంది. ఈ టైగర్ 3 కోసం టైగర్ x పఠాన్ సీక్వెన్స్ దాదాపు 10 నుంచి 12 రోజుల పాటు సాగుతుందని తెలుస్తోంది. ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.