Manobala: మనోబాల, కోవై సరళ ఇంటర్వ్యూ.. 24 గంటల్లోనే తీవ్ర విషాదం.. కన్నీళ్లు పెట్టిస్తోన్న చివరి వీడియో..

గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మనోబాల బుధవారం ఆకస్మాత్తుగా మరణించారు. చనిపోవడానికి ఒక్కరోజు ముందే ఆయన సొంత యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియోను షేర్ చేసారు మనోబాల. అది ఆయన చివరిసారిగా నటి కోవై సరళను ఇంటర్వ్యూ చేసిన వీడియో. ఆ తర్వాత 24 గంటల్లోనే మనోబాల ఈ లోకాన్ని విడిచివెళ్లడం ఇండస్ట్రీని షాక్ కు గురిచేసింది.

Manobala: మనోబాల, కోవై సరళ ఇంటర్వ్యూ.. 24 గంటల్లోనే తీవ్ర విషాదం.. కన్నీళ్లు పెట్టిస్తోన్న చివరి వీడియో..
Manobala
Follow us
Rajitha Chanti

|

Updated on: May 04, 2023 | 1:22 PM

కమెడియన్ మనోబాల హఠాన్మరణం కోలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎప్పుడూ నవ్విస్తూ, సరదాగా ఉండే తమతోటి నటుడు అకాల మరణం తమను కలచివేసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సినీ ప్రముఖులు. ఆయన మృతి పట్ల నటీనటులు, దర్శక నిర్మాతలు సంతాపం తెలియజేస్తున్నారు. అయితే గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మనోబాల బుధవారం ఆకస్మాత్తుగా మరణించారు. చనిపోవడానికి ఒక్కరోజు ముందే ఆయన సొంత యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియోను షేర్ చేసారు మనోబాల. అది ఆయన చివరిసారిగా నటి కోవై సరళను ఇంటర్వ్యూ చేసిన వీడియో. ఆ తర్వాత 24 గంటల్లోనే మనోబాల ఈ లోకాన్ని విడిచివెళ్లడం ఇండస్ట్రీని షాక్ కు గురిచేసింది.

అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన … ఆ తర్వాత నటుడిగా ఎన్నో చిత్రాల్లో కనిపించారు. తన కామెడితో ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. దర్శకుడిగాను మెప్పించారు. ఆయన తెరకెక్కించిన ఆగాయ గంగై, పిళ్లై నీలా, జైల్ పర్వీ చిత్రాలు విజయాన్ని అందుకున్నాయి. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోను ఫుల్ యాక్టివ్ గా ఉంటారు మనోబాల. స్వయంగా ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. మనోబాల వేస్ట్ పేపర్ పేరుతో ఆయన ఛానెల్ ఉండగా..అందులో సినీ ప్రముఖులను ఇంటర్వ్యూలు చేసేవారు మనోబాల.

ఇటీవలే ఆయన నటి కోవై సరళను ఇంటర్వ్యూ చేశారు. అందులో సరళతో ఎప్పటిలాగే సినిమాల గురించి మాట్లాడారు. ఈ వీడియోను మంగళవారం తన యూట్యూబ్ ఛానల్లో షేర్ చేశారు మనోబాల. ఆ తర్వాత 24 గంటల్లోనే ఆయన మరణించారు. దీంతో ఆయన అభిమానులు షాకయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. మిస్ యూ సర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.