Mehreen Pirzadaa: మెహ్రీన్‏కు ఏమైందీ ఇలా మారిపోయింది ?.. షాకింగ్ లుక్‏లో ఎఫ్ 2 బ్యూటీ..

న్యాచురల్ స్టార్ నాని నటించిన కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మెహ్రీన్ ఫిర్జాదా. తొలి సినిమాతోనే అందం.. అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత ఈ అమ్మడు నటించిన చిత్రాలు అంతగా హిట్టు కాలేదు. దీంతో తెలుగు చిత్రపరిశ్రమలో దర్శకనిర్మాతలు ఎక్కువగా పట్టించుకోలేదు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా

Mehreen Pirzadaa: మెహ్రీన్‏కు ఏమైందీ ఇలా మారిపోయింది ?.. షాకింగ్ లుక్‏లో ఎఫ్ 2 బ్యూటీ..
Mehreen
Follow us
Rajitha Chanti

|

Updated on: May 04, 2023 | 12:35 PM

సినీ పరిశ్రమలో హీరోయిన్‏గా నిలదొక్కుకోవాలంటే అందం, టాలెంట్ మాత్రమే కాదు.. కాసింత అదృష్టం ఉండాల్సిందే. తొలి సినిమాతోనే మంచి విజయం అందుకుని… ఆ తర్వాత చిన్న చిన్న సినిమాలతో సరిపెట్టుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. సరైన హిట్ కోసం ఎదురుచూస్తూ.. ఎప్పటికప్పుడు నెట్టింట అభిమానులతో ఇంట్రాక్ట్ అయ్యేందుకు తెగ యాక్టివ్ గా ఉంటున్నారు. చేసిందీ తక్కువ సినిమాలే అయినా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదా. న్యాచురల్ స్టార్ నాని నటించిన కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మెహ్రీన్ ఫిర్జాదా. తొలి సినిమాతోనే అందం.. అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఆ తర్వాత ఈ అమ్మడు నటించిన చిత్రాలు అంతగా హిట్టు కాలేదు. దీంతో తెలుగు చిత్రపరిశ్రమలో దర్శకనిర్మాతలు ఎక్కువగా పట్టించుకోలేదు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా పలు చిత్రాల్లో నటించింది. అయితే డైరెక్టర్ అనిల్ రావిపూడి, వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన ఎఫ్ 2 సినిమా ఈ అమ్మాడికి మంచి బూస్ట్ ఇచ్చింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు క్యూ కట్టాయి. చివరిసారిగా మెహ్రీన్ ఎఫ్ 3 చిత్రంలో కనిపించింది.ఈ మూవీ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

చాలా రోజులుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మెహ్రీన్ తన ఫిట్ నెస్ పై బాగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఎప్పుడూ బొద్దుగా కనిపించిన మెహ్రీన్ ఇప్పుడు బాగా సన్నబడింది. వర్కవుట్స్, డైట్ పాటిస్తూ జీరో సైజ్ కు వచ్చేసింది. తాజాగా తన లుక్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి కాస్త వైరలవుతున్నాయి. మెహ్రీన్ కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. మెహ్రీన్‌కు ఏమైంది ?… ఎందుకు ఇంతగా మారిపోయింది ?.. బొద్దుగా ఉంటేనే బాగుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.