Sadha: కన్నీళ్లు పెట్టుకున్న సదా.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన హీరోయిన్.. అసలేం జరిగిందంటే..

అయితే హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై సందడి చేసింది. పలు రియాల్టీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను అలరించింది. చాలా కాలంగా అటు వెండితెరకు.. ఇటు బుల్లితెరకు దూరంగా ఉన్న బ్యూటీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేసింది. అందులో సదా కన్నీళ్లు పెట్టుకుంది.

Sadha: కన్నీళ్లు పెట్టుకున్న సదా.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన హీరోయిన్.. అసలేం జరిగిందంటే..
Sadha
Follow us
Rajitha Chanti

|

Updated on: May 06, 2023 | 8:22 AM

తెలుగు చిత్రపరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది సదా. జయం సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. తొలి చిత్రానికి ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అందుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్, విక్రమ్ వంటి స్టార్ హీరోస్ సరసన నటించి మెప్పించింది. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్న ఈ భామ.. కన్నడ, మలయాళ భాషల్లోనూ అనేక చిత్రాల్లో నటించింది. అయితే హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై సందడి చేసింది. పలు రియాల్టీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను అలరించింది. చాలా కాలంగా అటు వెండితెరకు.. ఇటు బుల్లితెరకు దూరంగా ఉన్న  బ్యూటీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేసింది. అందులో సదా కన్నీళ్లు పెట్టుకుంది.

కొద్ది కాలంగా ముంబైలో సదా ఎఱ్త్ లింగ్స్ కెఫె పేరిట వెజ్ రెస్టారెంట్ నడుపుతుంది. ఈ కెఫె చూసుకోవడంలో తనకు ఎంతో తృప్తి ఉందని గతంలోనూ వెల్లడించింది. అయితే ఆకస్మాత్తుగా ఈ కెఫె మూసేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెబుతూ భావోద్వేగానికి గురైంది. “2019 ఏప్రిల్ 23న ఎర్త్ లింగ్స్ కెఫె ప్రారంభించాను. ఇది నా ఫస్ట్ బిజినెస్. ఈ వ్యాపారాన్ని నా కన్నబిడ్డాలా చూసుకున్నారు. 2023 ఏప్రిల్ 23 నాకు బాధను మిగిల్చిన రోజు. కెఫె స్థలం యజమాని ఫోన్ చేసి ఖాలీ చేయాలని ఆదేశించాడు. అందుకు నెల రోజుల గడువు ఇచ్చాడు. నాకు పెద్ద షాక్ తగిలినట్లైంది. కన్నీళ్లు వస్తున్నాయి. మూడు వారాల్లోనే మేము ఖాళీ చేయాలి. నేను కెఫె పెట్టకముందు ఈ స్థలం దారణ స్థితిలో ఉంది. కోవిడ్ సమయంలో రోజుకు 12 గంటలు ఇక్కడే పనిచేశాను..

ఇవి కూడా చదవండి

సంవత్సరం పాటు కష్టపడి దీన్ని అందంగా తీర్చిదిద్దాను. మిగతా పనని కూడా పక్కన పడేసి ఇదే ప్రపంచంగా బతికాను. లాక్ డౌన్ కారణంగా బిజినెస్ కాకపోయాన సరిగ్గా అద్దె చెల్లించాను. ఇప్పుడు దీన్ని వదిలి వెళ్లాలని నాకు లేదు. తట్టుకోలేకపోతున్నాను.. ఏదో కోల్పోతున్నట్లుగా ఉంద. మూడు వారాలు మాత్రమే ఈ రెస్టారెంట్ అందుబాటులో ఉంటుంది. ” అంటూ చెబుతూ కన్నీ్ళ్లు పెట్టుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ సదాకు మద్దతు తెలుపుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?