Adipurush: ఫ్యాన్స్‏కు గుడ్‏న్యూస్ చెప్పిన ప్రభాస్.. ఆరోజే ‘ఆదిపురుష్’ ట్రైలర్ వచ్చేస్తోందంటూ..

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ జూన్ 16న తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు భాషలలో విడుదలకాబోతుంది. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే ప్రమోషన్స్ షూరు చేసేందుకు సిద్దమయ్యింది చిత్రయూనిట్.

Adipurush: ఫ్యాన్స్‏కు గుడ్‏న్యూస్ చెప్పిన ప్రభాస్.. ఆరోజే 'ఆదిపురుష్' ట్రైలర్ వచ్చేస్తోందంటూ..
Aadhipurush
Follow us
Rajitha Chanti

|

Updated on: May 06, 2023 | 8:51 AM

యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్ ఆకట్టుకోగా.. టీజర్ మాత్రం నిరాశపరిచింది. ఇందులో వీఎఫ్ఎక్స్, రావణాసురుడు, ఆంజనేయ లుక్స్ పై విమర్శలు ఎదురయ్యాయి. దీంతో గ్రాఫిక్స్ తగ్గించి మరిన్ని మార్పులు చేసే పనిలో పడ్డారు చిత్రయూనిట్. ఈక్రమంలోనే గతంలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా జూన్ కు వాయిదా పడింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ జూన్ 16న తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు భాషలలో విడుదలకాబోతుంది. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే ప్రమోషన్స్ షూరు చేసేందుకు సిద్దమయ్యింది చిత్రయూనిట్. అయితే కొద్ది రోజులుగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ప్రభాస్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.

ఆదిపురుష్ ట్రైలర్ మే 9న రిలీజ్ కాబోతుందంటూ ప్రభాస్ తన ఇన్ స్టా వేదికగా తెలియజేశారు ప్రభాస్. అలాగే ఈ మూవీ నుంచి మరో కొత్త పోస్టర్ విడుదల చేశారు. దీంతో యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మరోవైపు ఈ సినిమాకు నార్త్ లో ప్రీ బిజినెస్ భారీగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొదట్లో పూర్తిగా నెగిటివిని సంపాదించుకున్న ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అడియన్స్ తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారని నమ్మకంగా భావిస్తున్నారు డైరెక్టర్ ఓంరౌత్.

ఇవి కూడా చదవండి

ఈ చిత్రంలో సీత పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు అజయ్ అతుల్ సంగీతం అందిస్తుండగా.. జూన్ 16న పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్ కె చిత్రాలతో బిజీగా ఉన్నారు.

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?