AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ మూవీలో రానా పాత్ర మిస్ చేసుకున్న ఇద్దరు స్టార్ హీరోస్ ఎవరో తెలుసా ?..

మొదటిసారి పవన్, రానా కలిసిన నటించిన ఈ సినిమాకు అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా రానా పాత్రకు మంచి పేరు వచ్చింది. హీరోకు ఏమాత్రం తగ్గకుండా పొగరుతోనే కాకుండా.. ఫ్యామిలీ పరంగా ఎమోషన్స్ చూపిస్తూ నటనతో మరోసారి మెప్పించాడు రానా.

Bheemla Nayak: 'భీమ్లా నాయక్' మూవీలో రానా పాత్ర మిస్ చేసుకున్న ఇద్దరు స్టార్ హీరోస్ ఎవరో తెలుసా ?..
Rana
Rajitha Chanti
|

Updated on: May 08, 2023 | 4:58 PM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గతేడాది ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ భారీగానే వసూళ్లు రాబట్టింది. ఇందులో పవర్ స్టార్ జోడీగా నిత్యా మీనన్ నటించగా.. రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ కీలకపాత్రలలో కనిపించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్‏గా ఈ మూవీ వచ్చింది. మొదటిసారి పవన్, రానా కలిసిన నటించిన ఈ సినిమాకు అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా రానా పాత్రకు మంచి పేరు వచ్చింది. హీరోకు ఏమాత్రం తగ్గకుండా పొగరుతోనే కాకుండా.. ఫ్యామిలీ పరంగా ఎమోషన్స్ చూపిస్తూ నటనతో మరోసారి మెప్పించాడు రానా.

అయితే ఈ పాత్ర కోసం ముందుగా అనుకున్న హీరో రానా కాదట. ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ పాత్రను ఇద్దరు స్టార్ హీరోస్ మిస్ చేసుకున్నారట. ఇంతకీ వారిద్దరు ఎవరో తెలుసుకుందామా. అందులో ఒకరు మ్యాచో స్టార్ గోపిచంద్. అప్పటికే మరో సినిమాతో గోపిచంద్ బిజీగా ఉండడంతో ఈ సినిమాను వదిలేయాల్సి వచ్చిందట.

ఇవి కూడా చదవండి

ఇక ఆ తర్వాత మాస్ మాహారాజా రవితేజను సంప్రదించాగా… డేట్స్ అడ్జట్స్ కావంటూ వదిలేసారంట. అయితే రవితేజను స్వయంగా పవన్ అడగ్గా.. నటించాలని ఉన్నా.. వేరే సినిమాలకు డేట్స్ కేటాయించానని.. సున్నితంగా తిరస్కరించారట. దీంతో ఈ ఛాన్స్ రానా వద్దకు చేరింది. భీమ్లా నాయక్ చిత్రంలో పవన్, రానా నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ డైలాగ్స్ అందించారు.

Follow Us
ఏపీలో మరో బాలుడు మిస్సింగ్.. బయటకెళ్లి తిరిగిరాని రేయాన్స్‌
ఏపీలో మరో బాలుడు మిస్సింగ్.. బయటకెళ్లి తిరిగిరాని రేయాన్స్‌
ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు..
ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు..
ఆకలితో ఫుట్ పాత్ మీద నిల్చున్నాను.. పిలిచి అన్నం పెట్టాడు..
ఆకలితో ఫుట్ పాత్ మీద నిల్చున్నాను.. పిలిచి అన్నం పెట్టాడు..
నటుడు సాక్షి రంగారావు ఎలా మరణించారో తెలుసా..
నటుడు సాక్షి రంగారావు ఎలా మరణించారో తెలుసా..
ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన
ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన
వారెవ్వ అదిరిపోయే వంటకం ఇదే..బక్కగా అవ్వాలి అనుకునే వారికి బెస్ట్
వారెవ్వ అదిరిపోయే వంటకం ఇదే..బక్కగా అవ్వాలి అనుకునే వారికి బెస్ట్
చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..ఇలా చేస్తే రుచి అద్భుతం
చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..ఇలా చేస్తే రుచి అద్భుతం
గద్వాల్ చేనేత చీరలో నాగ చైతన్య సతీమణి శోభిత.. ఫొటోస్ ఇదిగో
గద్వాల్ చేనేత చీరలో నాగ చైతన్య సతీమణి శోభిత.. ఫొటోస్ ఇదిగో
వెల్లుల్లి కేవలం వంటలకే కాదు.. టాయిలెట్‌లోని క్రిములకు చెక్
వెల్లుల్లి కేవలం వంటలకే కాదు.. టాయిలెట్‌లోని క్రిములకు చెక్
అఖిల్‌- జైనబ్.. ఒకరినొకరు ముద్దుగా ఏమని పిల్చుకుంటారో తెలుసా?
అఖిల్‌- జైనబ్.. ఒకరినొకరు ముద్దుగా ఏమని పిల్చుకుంటారో తెలుసా?