Jr.NTR: ఎన్టీఆర్ జోడీగా సాహో బ్యూటీ.. మరోసారి తెలుగులోకి శ్రద్ధా కపూర్.. డైరెక్టర్ ఎవరంటే..

తారక్ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Jr.NTR: ఎన్టీఆర్ జోడీగా సాహో బ్యూటీ.. మరోసారి తెలుగులోకి శ్రద్ధా కపూర్.. డైరెక్టర్ ఎవరంటే..
Jr,ntr, Shraddha Kapoor
Follow us
Rajitha Chanti

| Edited By: seoteam.veegam

Updated on: May 18, 2023 | 7:19 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సెలబ్రెషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఆయన పుట్టినరోజు సందర్భంగా బ్లాక్ బస్టర్ హిట్ సింహాద్రి రీరిలీజ్ అవుతుండడంతో ఫ్యాన్స్ ఇప్పుడే సందడి మొదలుపెట్టేశారు. ఇక మరోవైపు తారక్ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా తర్వాత తారక్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. సలార్ సినిమా అనంతరం వీరిద్దరి ప్రాజెక్ట్ షూరు కానుంది. ఈక్రమంలో తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ కోసం మరో బాలీవుడ్ బ్యూటీని ఎంపిక చేశారట. ఇందులో తారక్ జోడిగా హీరోయిన్ శ్రద్ధా కపూర్ ను ఎంపిక చేసేందుకు సిద్ధమయ్యారట మేకర్స్. గతంలో ప్రభాస్, డైరెక్టర్ సుజీత్ కాంబోలో వచ్చిన సాహో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రద్ధా. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో తెలుగులో మరో మూవీ చేయలేదు. దాదాపు నాలుగేళ్ల తర్వాత మరోసారి తెలుగు తెరపై సందడి చేయనుంది.

అయితే ఈ సినిమా కోసం ముందుగా దీపికాను అనుకున్నారట. కానీ ప్రస్తుతం ఆమె వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో ఈ ఛాన్స్ శ్రద్ధాను చేరిందని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ నడుస్తోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. తారక్, ప్రశాంత్ నీల్ కాంబో కోసం యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!