Ajith Kumar: బైక్ పై ప్రపంచాన్ని చుట్టేసేందుకు రెడీ అయిన స్టార్.. మరో సాహసయాత్రలో అజిత్..

ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలతోపాటు.. నేపాల్, భూటాన్ లకు బైక్ పై వెళ్లారు. అందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇక ఇప్పుడు ఈ హీరోకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

Ajith Kumar: బైక్ పై ప్రపంచాన్ని చుట్టేసేందుకు రెడీ అయిన స్టార్.. మరో సాహసయాత్రలో అజిత్..
Ajith Kumar
Follow us
Rajitha Chanti

|

Updated on: May 10, 2023 | 4:07 PM

సౌత్ ఇండస్ట్రీలో హీరో అజిత్ కుమార్‏కు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. కేవలం తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ అజిత్‏కు ఎక్కువగానే ఫాలోయింగ్ ఉంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఆనతికాలంలోనే స్టార్ డమ్ సంపాదించుకోవడమే కాకుండా.. నటనలోనూ.. వ్యక్తిత్వంలోనూ అభిమానుల హృదయాలను దొచుకున్నారు. అజిత్ వ్యక్తిత్వం చాలా ప్రత్యేకం. ఇండస్ట్రీలో స్టార్ హీరో అయినా.. ఇప్పటికీ సింప్లిసిటిగానే ఉంటారు. అంతేకాదు.. ఇప్పటికే ఫోన్ వాడని ఏకైక హీరో. ఇక సోషల్ మీడియా గురించి చెప్పక్కర్లేదు. అజిత్ కు రేసింగ్ అంటే చాలా ఇష్టం. సినిమా నుంచి కాస్త్ బ్రేక్ దొరికితే బైక్ రైడింగ్ కు వెళ్తారు. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలతోపాటు.. నేపాల్, భూటాన్ లకు బైక్ పై వెళ్లారు. అందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇక ఇప్పుడు ఈ హీరోకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

త్వరలోనే అజిత్ మరోసారి బైక్ పై సాహస యాత్ర చేయనున్నారట. ఈసారి ఏకంగా ప్రపంచయాత్ర చేయనున్నారట. ఈ విషయాన్ని అజిత్ మేనేజర్ ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేశారు. “అజిత్ ఇప్పటికే బైక్ పై ఎన్నో సాహస యాత్రలు చేశారు. సవాళ్లు నిండిన భూభాగంలో ప్రయాణించారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ అనేక యాత్రలు చేశారు. ఇటీవలే బైక్ పై అనేక రాష్ట్రాలను పర్యటించారు. త్వరలోనే మరో యాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది నవంబర్ లో అజిత్ తన బైక్ పై ప్రపంచయాత్ర స్టార్ట్ చేయనున్నారు” అని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇటీవలే తునీవు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు అజిత్. ఇప్పుడు ఆయన మరోసారి డైరెక్టర్ హెచ్. వినోద్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. వరల్డ్ టూర్ కోసం ఈ సినిమా చిత్రీకరణను కూడా తొందరగానే కంప్లీట్ చేశారట. ప్రస్తుతం మరో దర్శకుడితో తన 62వ సినిమాను చేయనున్నారట.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ