Priyanka Chopra: పెళ్లికి ముందే చాలా మందితో డేటింగ్ చేశా.. ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్..

పెళ్లికి ముందు తను చాలా మందితో డేటింగ్ చేశానని.. ఒకరితో బ్రేకప్ కాగానే.. మరొకరిని ప్రేమించేదాన్ని అని.. తన భర్త కూడా అనేక మందిని ప్రేమించాడని తెలిపింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Priyanka Chopra: పెళ్లికి ముందే చాలా మందితో డేటింగ్ చేశా.. ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్..
Priyanka Chopra, Nick Jonas
Follow us
Rajitha Chanti

|

Updated on: May 11, 2023 | 2:42 PM

ప్రియాంక చోప్రా.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఓ పాప జన్మించిన సంగతి తెలిసిందే. నిక్ తో మ్యారెజ్ అనంతరం.. ప్రస్తుతం హాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయ్యింది ప్రియాంక. ఇటీవలే అమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఇటీవలే అలెక్స్ కూపర్.. కాల్ హర్ డాడీ పాడ్ క్యాస్ట్ లో పాల్గొంది ప్రియాంక. ఇందులో తన సినిమా అప్డేట్స్ కాదు.. వ్యక్తిగత జీవిత విషయాలను పంచుకుంది. పెళ్లికి ముందు తను చాలా మందితో డేటింగ్ చేశానని.. ఒకరితో బ్రేకప్ కాగానే.. మరొకరిని ప్రేమించేదాన్ని అని.. తన భర్త కూడా అనేక మందిని ప్రేమించాడని తెలిపింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

“నిక్ జోనస్ ను కలవడానికి ముందు కొందరిని ప్రేమించాను. ఒకరితో బ్రేకప్ కాగానే.. మరొకరిని ప్రేమించేదాన్ని. ఒక బంధానికి.. మరొక బంధానికి మధ్య పెద్ద గ్యాప్ కూడా ఇవ్వలేదు.. నటిగా ఎంతో బిజీగా ఉండేదాన్ని. నాతో పనిచేసిన చాలామందితో డేటింగ్ చేశాను. అందులో కొన్ని విషాదంగా ముగిసాయి. కానీ నేను డేటింగ్ చేసినవారందరూ అద్భుతమైనవారు. చివరి బ్రేకప్ తర్వాత మరో బంధంలో అడుగుపెట్టడానికి చాలా టైం తీసుకున్నాను. ఎందుకుంటే.. నా ప్రేమలన్నీ విఫలమయ్యాయి.. నన్ను నేను ప్రశ్నించుకున్నాను.. ఆ తర్వాత నిక్ కలిశాడు. అతడు నా ప్రియుడిగానే కాక భర్తగానూ ప్రమోషన్ తీసుకున్నాడు. తను కూడా నాకంటే ముందు చాలా మందిని ప్రేమించాడు. కానీ.. అతడి గతం కన్నా.. తనతో భవిష్యత్తు పంచుకోవడం ముఖ్యమనుకున్నాను..

అయిపోయినదాన్ని తవ్వడం అనవసరం అనిపించింది. తనతో జీవితాన్ని కొనసాగించాలనుకున్నాను. ” అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక. నిక్ జోనస్ గతంలో మిలీ సైరస్, సెలీనా గోమెజ్, ఒలీవియా కుల్ఫో, లిలీ కొల్లిన్స్, కెండల్ జెన్నర్, కేట్ హడ్సన్ ఇలా పలువురితో ప్రేమాయణం నడిపాడు. చివరకు ప్రియాంక చోప్రాను 2018లో వివాహం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.