- Telugu News Photo Gallery Cinema photos Actress Meera Jasmine Re Rentry In Kollywood Industry After 9 Years telugu cinema news
Meera Jasmine: 9 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న మీరా జాస్మిన్.. మళ్లీ హీరోయిన్గా కనిపించనున్న అందాల తార..
దక్షిణాది సినీ పరిశ్రమలో పరిచయం అవసరంలేని పేరు మీరా జాస్మిన్. తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. టాలీవుడ్ , కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తమిళంలో రన్ అనే సినిమాతో కథానాయికగా పరిచయమైంది మీరా జాస్మిన్. మాధవన్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించింది.
Updated on: May 11, 2023 | 4:43 PM

దక్షిణాది సినీ పరిశ్రమలో పరిచయం అవసరంలేని పేరు మీరా జాస్మిన్. తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. టాలీవుడ్ , కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

తమిళంలో రన్ అనే సినిమాతో కథానాయికగా పరిచయమైంది మీరా జాస్మిన్. మాధవన్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించింది.

తెలుగులో భద్ర, గుడుంబా శంకర్ వంటి చిత్రాలతో అలరించిన మీరా జాస్మిన్.. ఆ తర్వాత అంతగా హిట్టైన సినిమాలు చేయలేదు. చివరిగా ఆమె నటించిన చిత్రం గోరింటాకు.

పెళ్లి తర్వాత నటనకు దూరమైన మీరాజాస్మిన్.. ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యింది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ మరోసారి ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది.

దాదాపు 9 ఏళ్ల తర్వాత సినీ పరిశ్రమలోకి రీఎంట్రీ ఇస్తుంది మీరా జాస్మిన్. ప్రస్తుతం ఆమె తమిళంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో నయనతార సైతం నటిస్తుంది.

తమిళంలో మీరాజాస్మిన్ నటించిన చివరి చిత్రం విజ్ఞాని. ఇది 2014లో విడుదలైంది. కాగా సుమారు దశాబ్దం తర్వాత మళ్లీ కోలీవుడ్ రీఎంట్రీ ఇస్తున్నారు మీరా జాస్మిన్.

వైనాట్ స్టూడియోస్ పతాకంపై శశికాంత్ మెగాఫోన్ పట్టి నిర్మిస్తున్న చిత్రం టెస్ట్. క్రికెట్ నేపథ్యంలో రూపొందుతున్న ఇందులో మాదవన్, సిద్ధార్థ్, నయనతార ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఇందులో మీరా జాస్మిన్ గాయని శక్తి శ్రీ సంగీత దర్శకురాలిగా కనిపించనున్నారు.

కొద్ది రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈమూవీ ఈ ఏడాది ప్రథమార్థంలో కానీ.. చివరిలో గానీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

9 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న మీరా జాస్మిన్.. మళ్లీ హీరోయిన్గా కనిపించనున్న అందాల తార..

9 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న మీరా జాస్మిన్.. మళ్లీ హీరోయిన్గా కనిపించనున్న అందాల తార..





























