- Telugu News Photo Gallery Cinema photos Soundarya Rajinikanth Files Police Complaint about missing luxury car key
Rajinikanth: ఇదెక్కడి అభిమానం సామీ..? స్టార్ సెలబ్రెటీ కూతుళ్ల ఇంట్లో వరుస చోరీలు
సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం, కుటుంబం వంటి పలు విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపుతుంటారు. మహా అయితే వాళ్లతో ఫొటోలు, సెల్ఫీలు దిగడం, ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడం వంటివి చేస్తుంటారు. ఐతే గుర్తుగా వారి వస్తువులు దొంగతనం చేయాలని ఎవ్వరూ అనుకోరు. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేస్తే పోలీస్ కేసులు, మీడియా అటెన్షన్ మాములుగా ఉండదు..
Updated on: May 11, 2023 | 2:39 PM

సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం, కుటుంబం వంటి పలు విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపుతుంటారు. మహా అయితే వాళ్లతో ఫొటోలు, సెల్ఫీలు దిగడం, ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడం వంటివి చేస్తుంటారు. ఐతే గుర్తుగా వారి వస్తువులు దొంగతనం చేయాలని ఎవ్వరూ అనుకోరు. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేస్తే పోలీస్ కేసులు, మీడియా అటెన్షన్ మాములుగా ఉండదు.

ఐతే ఈ దొంగలు మాత్రం కేవలం సెలబ్రిటీలనే టార్గెట్ చేస్తున్నారు. అందులోనూ సూపర్‌స్టార్ రజినీకాంత్ కూతుర్లే వారి టార్గెట్.

ఆ మధ్య రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో చోరీ జరిగిన విషయం తెల్సిందే. రూ.60 లక్షల విలువైన బంగారు ఆభరణాలు పోయాయంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇంట్లో పనిమనిషే ఆ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చేశారు.

ఈ చోరీ సంఘటన మరువకముందే తాజాగా రజనీ చిన్న కూతురు సౌందర్య రజినీకాంత్‌కు చెందిన ఖరీదైన ఎస్యూవీ కారు 'కీ' ఎవరో కొట్టేశారని చెన్నైలోని తేనాంపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

కాలేజీ ఫంక్షన్‌కు కారులో స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిన సౌందర్య, తిరిగి వచ్చిన తర్వాత చూస్తే కీ కనిపించడం లేదని పోలీసులకు తెల్పింది. దీంతో గత రజినీ ఇద్దరు కూతుళ్ల దొంగతనం కేసులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.




