Ram Charan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మాస్ గ్లింప్స్ పై రామ్ చరణ్ ట్వీట్.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..

గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం.. దాదాపు 11 ఏళ్ల తర్వాత వీరిద్దరి మధ్యలో సినిమా వస్తుండడంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ భారీ హైప్ క్రియేట్ చేసింది. ఆ వీడియో పవన్ డైలాగ్స్.. లుక్స్ సినిమాపై క్యూరియాసిటిని పెంచడమే కాకుండా.. దీనికి మాసివ్ రెస్పాన్స్ వచ్చింది.

Ram Charan: 'ఉస్తాద్ భగత్ సింగ్' మాస్ గ్లింప్స్ పై రామ్ చరణ్ ట్వీట్.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..
Ram Charan, Pawan Kalyan
Follow us
Rajitha Chanti

| Edited By: seoteam.veegam

Updated on: May 18, 2023 | 6:48 PM

బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అభిమానులకు ఫుల్ మీల్స్ అందించేందుకు సిద్ధమయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎలక్షన్స్ లోపు వీలైనంతవరకు తన చేతిలో ఉన్న అన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశ్యంతో శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. ఇప్పటికే డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కిస్తోన్న వినోదయ సిత్తం రీమేక్ లో తన రోల్ షెడ్యూల్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమానే కాకుండా.. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు చిత్రం చేస్తుండగా.. ఇప్పుడు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం.. దాదాపు 11 ఏళ్ల తర్వాత వీరిద్దరి మధ్యలో సినిమా వస్తుండడంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ భారీ హైప్ క్రియేట్ చేసింది. ఆ వీడియో పవన్ డైలాగ్స్.. లుక్స్ సినిమాపై క్యూరియాసిటిని పెంచడమే కాకుండా.. దీనికి మాసివ్ రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ఈ వీడియోకు టాలీవుడ్ సినీప్రముఖుల నుంచి అదిరే రెస్పాన్స్ రాగా.. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రియాక్ట్ అయ్యారు.

ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ తనకు విపరీతంగా నచ్చేసిందని.. ఈ మాసివ్ ఎంటర్టైనర్ ను థియేటర్లలో చూసేందుకు వెయిట్ చేయలేకపోతున్నానని.. చిత్రయూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశారు చెర్రీ. బాబాయ్ సినిమాపై చరణ్ నుంచి సడెన్ క్రేజీ ట్వీట్ రావడంతో మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరోవైపు చరణ్.. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో చరణ్ మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ డ్రింక్స్‌కు గుడ్‌బై చెప్పండి
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ డ్రింక్స్‌కు గుడ్‌బై చెప్పండి
గేమ్ ఛేంజర్‌కు నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు.. ఫ్యాన్స్ ఊరుకుంటారా..
గేమ్ ఛేంజర్‌కు నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు.. ఫ్యాన్స్ ఊరుకుంటారా..
మీరూ రాత్రిళ్లు స్వెటర్లు, సాక్స్‌ ధరించి నిద్రపోతున్నారా?
మీరూ రాత్రిళ్లు స్వెటర్లు, సాక్స్‌ ధరించి నిద్రపోతున్నారా?
ప్రయాగ్‌రాజ్‌లో మొదలైన సందడి స్పెషల్ ఎట్రాక్షన్గా బాబాలు, సాధువుల
ప్రయాగ్‌రాజ్‌లో మొదలైన సందడి స్పెషల్ ఎట్రాక్షన్గా బాబాలు, సాధువుల
థర్డ్‌ పార్టీ యాప్‌ లేకుండా వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్ల స్కాన్!
థర్డ్‌ పార్టీ యాప్‌ లేకుండా వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్ల స్కాన్!
నాకు పెళ్లైంది.. కానీ నెలకు వారం రోజులు మాత్రమే
నాకు పెళ్లైంది.. కానీ నెలకు వారం రోజులు మాత్రమే
వామ్మో తెలంగాణలో అడుగు పెట్టిన HMPV గత నెలలోనే 11 కేసులుగుర్తింపు
వామ్మో తెలంగాణలో అడుగు పెట్టిన HMPV గత నెలలోనే 11 కేసులుగుర్తింపు
ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం ఏది?
ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం ఏది?
సినిమాల్లోకి పవన్ కల్యాణ్ కుమారుడు.. రామ్ చరణ్ ఏమన్నారంటే?
సినిమాల్లోకి పవన్ కల్యాణ్ కుమారుడు.. రామ్ చరణ్ ఏమన్నారంటే?
ఊపందుకున్న యాసంగి నాట్లు.. పొరుగు రాష్ట్రాల కూలీలకు ఫుల్ డిమాండ్
ఊపందుకున్న యాసంగి నాట్లు.. పొరుగు రాష్ట్రాల కూలీలకు ఫుల్ డిమాండ్