ముచ్చటగా మూడోసారి ఐష్ – త్రిష.. ఆ స్టార్ హీరోకి జోడిగా ఇద్దరు బ్యూటీస్..
ఇద్దరు లేడీస్‌కి పడదని... ఒక చోట ఉండలేరనీ? ఎవరు చెప్పారని ఐశ్వర్య రాయ్ బచ్చన్ అండ్ త్రిష ఓపెన్‌గా అడుగుతున్నారు. ఇద్దరి మధ్య పొత్తు కుదరకపోతే... ఒకటి కాదు, రెండు కాదు, ముచ్చటగా మూడో సినిమా ఎలా చేస్తారన్నది ఇప్పుడు రెయిజ్ అవుతున్న క్వశ్చన్.

ఇద్దరు లేడీస్‌కి పడదని… ఒక చోట ఉండలేరనీ? ఎవరు చెప్పారని ఐశ్వర్య రాయ్ బచ్చన్ అండ్ త్రిష ఓపెన్‌గా అడుగుతున్నారు. ఇద్దరి మధ్య పొత్తు కుదరకపోతే… ఒకటి కాదు, రెండు కాదు, ముచ్చటగా మూడో సినిమా ఎలా చేస్తారన్నది ఇప్పుడు రెయిజ్ అవుతున్న క్వశ్చన్. ఆల్రెడీ పొన్నియిన్ సెల్వన్ రెండు పార్టులు చేసిన ఈ బ్యూటీస్, ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాకు సంతకం చేయబోతున్నారనే వార్త వైరల్ అవుతోంది.
ప్రియురాలు పిలిచింది సినిమాలో అజిత్, ఐశ్వర్యరాయ్ నటించారు. వీరిద్దరూ ఆన్‌స్క్రీన్ జోడీ కాకపోయినా, త్వరలోనే అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కోలీవుడ్ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అన్నీ పర్ఫెక్ట్ గా ఉంటే, ఈ పాటికే ఏకే 62 మొదలుకావాల్సింది. కానీ స్క్రిప్ట్ కుదరని కారణంగా కాస్త ఆలస్యం అయింది. వచ్చే నెల నుంచి ఆన్‌సెట్స్ కి వెళ్లనుంది. ఈ మూవీలో అజిత్ డ్యూయల్ రోల్‌లో కనిపిస్తారట. ఒక అజిత్ పక్కన ఐశ్వర్య రాయ్, మరో అజిత్ పక్కన త్రిష జోడిగా నటిస్తారన్నది టాక్.
అజిత్‌తో త్రిష జోడీ కట్టడం ఇదేం తొలిసారి కాదు. ఆల్రెడీ ఈ పెయిర్‌కి మంచి పేరే ఉంది. ఇటు ఐశ్వర్య, త్రిష కూడా పొన్నియిన్ సెల్వన్ రెండు పార్టుల్లోనూ కలిసి కనిపించారు. ఇద్దరి మధ్య ఆఫ్ స్క్రీన్ బాండింగ్ కూడా బాగానే ఉంది. ఒకవేళ ఐశ్వర్య, త్రిష… ఇద్దరిలో ఎవరైనా కాల్షీట్ అడ్జస్ట్ చేయలేకపోతే.. ఇమీడియట్ ఆప్షన్‌గా కంగనా రనౌత్ పేరు వినిపిస్తోంది. ఈ ముగ్గురిలో అజిత్ నెక్స్ట్ మూవీకి కలిసిపనిచేసే ఇద్దరూ ఎవరనే ఆసక్తి మాత్రం సర్వత్రా కనిపిస్తోంది.




మరిన్ని సినిమా వార్తలు చదవండి..




