AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Double Ismart : ఈసారి డబుల్ ఇస్మార్ట్.. పూరీ.. రామ్ పోతినేని మూవీపై క్రేజీ అనౌన్స్‏మెంట్..

ఇస్మా్ర్ట్ శంకర్ సినిమా తర్వాత దీనికి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ మూవీని చేస్తామని అప్పట్లోనే పూరి వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత మరో ప్రాజెక్ట్స్ కారణంగా రామ్, పూరి బిజీ అయ్యారు. ఇక ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ మూవీపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.

Double Ismart : ఈసారి డబుల్ ఇస్మార్ట్.. పూరీ.. రామ్ పోతినేని మూవీపై క్రేజీ అనౌన్స్‏మెంట్..
Double Ismart
Rajitha Chanti
| Edited By: |

Updated on: May 18, 2023 | 3:48 PM

Share

డైరెక్టర్ పూరి జగన్నాథ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలతో సమానంగా ఫ్యాన్ బేస్ ఉన్న దర్శకుడు. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న పూరి.. ఇప్పుడు ఒక్క హిట్టు కోసం ఎదురుచూస్తున్నారు. కొంతకాలంగా వరుస డిజాస్టర్లతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక గతేడాది లైగర్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలనుకున్న పూరికి మరోసారి ఎదురుదెబ్బే తగిలింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో పూరి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం అందుకుంది. ఈ సినిమా పూరికి తీవ్ర నష్టాలను మిగిల్చింది. దీంతో వీరి కాంబోలో రావాల్సిన జనగణమణ చిత్రం కూడా ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే… వరుస పరాజయాలతో సతమతమవుతున్న పూరికి బూస్ట్ ఇచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మూవీకి బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా.. భారీ కలెక్షన్స్ రాబట్టింది.

ఇక ఇప్పుడు ఈ హిట్ కాంబో రిపీట్ అవుతుంది. ఇస్మా్ర్ట్ శంకర్ సినిమా తర్వాత దీనికి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ మూవీని చేస్తామని అప్పట్లోనే పూరి వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత మరో ప్రాజెక్ట్స్ కారణంగా రామ్, పూరి బిజీ అయ్యారు. ఇక ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ మూవీపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించగా.. తాజాగా ఈ సినిమా గురించి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేస్తు… వచ్చే ఏడాది మార్చి 8న పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నామని తెలియజేశారు. తాజాగా విడుదలైన టైటిల్ పోస్టర్ లో శివలింగం, త్రిశూలం కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాను తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ జగన్నాథ్, ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తైనట్లుగా తెలుస్తోంది. మిగిలిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి ఈ చిత్రాన్ని ఆగస్టులో రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని టాక్. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రామ్ పోతినేని.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో