AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆ గ్రామంలో హోలీ నాడు రంగులు చల్లుకోరు.. ఆ వింత ఆచారం వెనుక అసలు కథ ఇదే..

దేశమంతా రంగుల కేళిలో మునిగిపోతుంటే.. ఆ ఊరి జనం మాత్రం చిటికెడు రంగు కూడా ముట్టుకోరు.. అసలు అక్కడ హోలీ పండుగే జరగదు. ఏంటి.. నమ్మలేకపోతున్నారా? నల్గొండ జిల్లాలోని ఓ గ్రామంలో దశాబ్దాలుగా వస్తున్న ఆ వింత ఆచారం వెనుక ఉన్న అసలు కథేంటి? వీళ్లు వారం రోజుల తర్వాత ఎందుకు రంగులు చల్లుకుంటారు? అనేది తెలుసుకుందాం..

Telangana: ఆ గ్రామంలో హోలీ నాడు రంగులు చల్లుకోరు.. ఆ వింత ఆచారం వెనుక అసలు కథ ఇదే..
Venkatampeta Holi Traditions Telangana
M Revan Reddy
| Edited By: |

Updated on: Mar 03, 2026 | 1:21 PM

Share

దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. పట్టణాలు, పల్లెల్లో ప్రజలందరూ కులమతాలకు అతీతంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుంటూ సంతోషంగా కేరింతలు కొడుతూ ఆనందోత్సాహాల్లో మునిగిపోతారు. కానీ ఆ గ్రామంలో హోలీ నాడు ప్రజలు వారు చిటికెడు రంగు సైతం ముట్టుకోరు. దీన్ని వెనక ఓ ఆచారం ఉంది.  అవును.. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం తీదేడు (వెంకటంపేట) గ్రామంలో హోలీ పండుగను జరుపుకోరు. దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటుతుండగా.. ఇందుకు విరుద్ధంగా వింత ఆచారం ఉంది. ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమిన హోలీ పండుగను జరుపుకుంటారు. కానీ వెంకటంపేటలో మాత్రం పౌర్ణమికి ఒక రోజు ముందు శ్రీభవానీ రామలింగేశ్వరస్వామి దేవాలయం నుండి స్వామి వారిని తీసుకువచ్చి కామ దాహనం చేస్తారు. ఆ తర్వాత గ్రామంలోని గుట్టపై ఉన్న మరో ఆలయానికి స్వామివారినీ తీసుకువస్తారు. ఆ రోజు నుండి 11 రోజులపాటు శ్రీభవానీ రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.

ఈ బ్రహ్మోత్సవాల సమయంలోనే హోలీ పండుగ రావడంతో గ్రామస్తులు హోలీ పండుగను జరుపుకోరు. హోలీ నాడు గ్రామస్తులు చిటికెడు రంగు సైతం ముట్టుకోరు. ఇది తమ పూర్వీకుల నుంచి ఆచారంగా వస్తుండటంతో అదే సంప్రదాయాన్ని ఆచరిస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శ్రీ భవాని రామలింగేశ్వర స్వామిని కొండ నుండి కిందికి తీసుకువచ్చి ఊరంతా వనవాసానికి వెళ్తుంటారు. మరుసటి రోజు బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే రథోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున గ్రామంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఒక్కరిసారిగా హోలీ పండగలో మునిగిపోతారనీ గ్రామస్తులు చెబుతున్నారు. దేశమంతా ఒకే రోజు హోలీ పండుగలు జరుపుకుంటే తాము మాత్రం వారం రోజుల తర్వాత హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటామని చెబుతున్నారు.

Follow Us
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి