Tarun: తరుణ్ పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన రోజా రమణి.. త్వరలోనే రీఎంట్రీ..

ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే, అదృష్టం వంటి చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాడు. ఒకప్పుడు లవర్ బాయ్ గా ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అయితే స్టార్ హీరోగా మంచి ఫాంలో ఉన్న సమయంలోనే అతను నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి.

Tarun: తరుణ్ పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన రోజా రమణి.. త్వరలోనే రీఎంట్రీ..
Tarun
Follow us
Rajitha Chanti

|

Updated on: May 16, 2023 | 3:20 PM

ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించిన హీరోలలో తరుణ్. అంజలి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ తర్వాత హీరోగా సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత నువ్వే కావాలి సినిమాతో హీరోగా స్టార్ డమ్ అందుకున్నారు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా..ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే, అదృష్టం వంటి చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాడు. ఒకప్పుడు లవర్ బాయ్ గా ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అయితే స్టార్ హీరోగా మంచి ఫాంలో ఉన్న సమయంలోనే అతను నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ బిజినెస్ రంగంలో రాణిస్తున్నారు. తాజాగా తరుణ్ పెళ్లి గురించి అతని తల్లి అలనాటి హీరోయిన్ రోజా రమణి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన కొడుకు పై వస్తున్న రూమర్స్ చూసి చాలా బాధ కలుగుతుందని అన్నారు. “తరుణ్ రోజూ గంటన్నర పాటు పూజలు చేస్తాడు. ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్తాడు. నా కంటే భక్తి ఎక్కువ. శని, మంగళవారం నాన్ వెజ్ తినడు. మిగతా రోజుల్లో ఎక్కువగా చికెన్ తింటాడు. ప్రస్తుతం అభిమానుల ఆశిస్సులతో హ్యాపీగా ఉన్నాం. తరుణ్ పెళ్లి ఒక్కటి అయితే చాలు. అంతకు మించింది ఏది లేదు. అది ఎలాగో అవుతుంది.

ఇవి కూడా చదవండి

అలాగే తరుణ్ త్వరలోనే రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఒక వెబ్ సిరీస్‏తోపాటు సినిమాను చేయబోతున్నాడు. అయితే వీటిల్లో ఏది ముందు రిలీజ్ అవుతుందో చెప్పలేను. అందరి ఆశిస్సులతో తరుణ్ కచ్చితంగా మళ్లీ హీరోగా రాణిస్తాడని ఆశిస్తున్నాను” అని అన్నారు. అయితే తరుణ్ పెళ్లి గురించి గత కొద్ది రోజులుగా రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

స్వప్న చేసిన తింగరి పని.. అడ్డంగా ఇరుక్కుపోయిన కావ్య!
స్వప్న చేసిన తింగరి పని.. అడ్డంగా ఇరుక్కుపోయిన కావ్య!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు