- Telugu News Photo Gallery Cinema photos Adah Sharma reaction on The Kerala Story’s unexpected success: 'I believe, have come true'
The Kerala Story: ‘ఆ విషయంలో నా నమ్మకమే నిజమైంది.. వారే దీనంతటికీ కారణం’: అదా శర్మ
మహిళలకు బలవంతంగా మతమార్పిడి చేసి ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో చేర్పించి, ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టేలా శిక్షణ ఇస్తున్నారనే కథాంశంగా తీసిన ‘ది కేరళ స్టోరీ’ మువీ ఊహించని వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్‌తోపాటు పలువిపక్షాలు భారీ ఎత్తున నిరసన తెలిపాయి. నాటి ప్రభుత్వాన్ని కించపరిచేలా ఈ చిత్రాన్ని రూపొందించారని ఆరోపించారు..
Updated on: May 16, 2023 | 3:11 PM

అదాశర్మ ప్రధానపాత్రలో నటించిన ‘ది కేరళ స్టోరీ’ ఊహించని రీతిలో బాక్సాఫీస్ వద్ద ఊహించని వసూళ్లు రాబడుతోంది. మే 5 న విడుదలైన ఈ మువీ కేవలం 10 రోజుల్లోనే రూ.136 కోట్లు వసూళ్లు చేసింది.

మహిళలకు బలవంతంగా మతమార్పిడి చేసి ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో చేర్పించి, ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టేలా శిక్షణ ఇస్తున్నారనే కథాంశంగా ఈ మువీని తెరకెక్కించారు. దీనిపై కాంగ్రెస్‌తోపాటు పలువిపక్షాలు భారీ ఎత్తున నిరసన తెలిపాయి. నాటి ప్రభుత్వాన్ని కించపరిచేలా ఈ చిత్రాన్ని రూపొందించారని ఆరోపించారు.

ఈ సినిమాపై నిషేధం విధించిన రాష్ట్రాల్లో కొన్ని చోట్ల తాజాగా ప్రదర్శనకు అనుమతులు లభించాయి. ఈ వివాదాలేవీ సినిమాపై ప్రభావం చూపకపోవడం, రోజురోజుకు పెరుగుతున్న ప్రేక్షక ఆదరణ పట్ల చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది.

ఈ చిత్ర విజయంపై నటి ఆదా శర్మ స్పందిస్తూ.. ఇంత పెద్ద విజయం సాధిస్తుందని తాను ఊహించలేదని తెలిపింది. ఈ విజయానికి కారణం అభిమానులేనని, కోట్ల మంది ఈ చిత్రాన్ని చూశారని ఆనందం వ్యక్తం చేసింది.

'నా సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని కలలో కూడా ఊహించలేదు. కానీ ఓ నటిగా ఈ సినిమాలో నటించినంతసేపు ప్రజలు చూడాలన్న ఆశతోనే చేశాను. ఇందులోని భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులకు నచ్చుతాయని గట్టిగా నమ్మాను. నా నమ్మకమే నిజమైంది. స్క్రిప్ట్ వినగానే నాకు తెలియకుండానే కన్నీరు వచ్చేసింది. అందుకే వెంటనే ఓకే చేశాను. ఈ స్థాయిలో విజయాన్ని అస్సలు ఊహించలేదని' అదా శర్మ ఆనందం వ్యక్తం చేసింది.





























