- Telugu News Photo Gallery Cinema photos Pooja Hegde mothers says her daughter suits with Allu Arjun in Tollywood and Hrithik Roshan in Bollywood
Pooja Hegde: బుట్టబొమ్మకి జోడీ నెం.1 ఎవరు? ఓపన్ అయిన పూజా హెగ్డే తల్లి..
మనమంటే సోఫిస్టికేటెడ్‌గా ఏదో చెప్పాలిగానీ, ఇండస్ట్రీకి బయట ఉన్నవాళ్లకి ఆ అవసరం ఏంటి? అందుకే వాళ్ల నోటి నుంచి వచ్చే మాటలకు నేను చాలా విలువిస్తాను. అందులోనూ నా గురించి మా అమ్మ ఓ విషయం చెబితే ఇమీడియేట్‌గా యాక్సెప్ట్ చేస్తాను అని అంటున్నారు పూజా హెగ్డే. ఇంతకీ ఆమె తల్లి ఏమన్నారు?
Updated on: May 16, 2023 | 6:02 PM

రెడ్డీ ఇక్కడ సూడూ అంటూ స్క్రీన్ మీద చెంగు చెంగుమంటూ ఎగిరే పూజా హెగ్డే ఇప్పటిదాకా చాలా సినిమాలే చేశారు.

మరి ఈ సినిమాల్లోని హీరోల్లో, పూజా మదర్‌కి నచ్చిన వారెవరు?

అని నార్త్ మీడియా ఆరా తీసింది. ఇంట్రస్టింగ్ విషయాలు చాలానే తెలిశాయి ఈ గోపికమ్మ గురించి.

పూజా హెగ్డే ఎంత మంది హీరోలతో కలిసి నటించినా ఆమె తల్లి మాత్రం జోడీ నెంబర్ వన్ క్రెడిట్ అల్లు అర్జున్‌కే ఇస్తారట.

అల వైకుంఠపురములో సినిమాను, అల్లు అర్జున్, పూజా హెగ్డే స్క్రీన్ ప్రెజెన్స్ నీ అంత తేలిగ్గా మర్చిపోలేరట.

నార్త్ లో ఈ లిస్టులో ఫస్ట్ ఉన్నారు హృతిక్ రోషన్. సిల్వర్ స్క్రీన్ మీద హృతిక్, పూజా కలిసి కనిపించినప్పుడు ఆమె తల్లి మనసు ఫుల్ ఖుష్ అయిందట.

పర్ఫెక్ట్ జోడీ అని కూడా అనిపించిందట. హృతిక్, పూజా కలిసి నటించిన సినిమా క్లిక్ కాకపోయినా, జోడీ అదుర్స్ అని ఫ్యామిలీ అంతా మాట్లాడుకున్నారట.

రీసెంట్‌గా సల్మాన్ ఖాన్‌తో పూజా ప్రేమలో ఉన్నారనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఈ సందర్భంలో పూజా తల్లి సల్మాన్ పేరును ప్రస్తావిస్తారా? లేదా? అని చాలా మంది ఈగర్‌గా వెయిట్ చేశారు.

అందులో వెయిట్ చేయడానికి ఏముంది? సల్మాన్ పక్కన కూడా పూజా అందంగా కనిపించిందంటున్నారు ఆమె మాతృమూర్తి. సో, జనాలు గుసగుసలాడటానికి... ఇక్కడ నో స్కోప్ అన్నమాట.




