ముఖం అందంగా మెరిసేందుకు అవే అప్లై చేస్తా.. జాన్వీ కపూర్..

Rajitha Chanti

Pic credit - Instagram

07 March 2026

ప్రస్తుతం భారతీయ సినిమా ప్రపంచంలో కథానాయికగా తనదైన ముద్ర వేసింది హీరోయిన్ జాన్వీ కపూర్. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ మోస్ట్ బిజీ హీరోయిన్.

మార్చి 6న ఈ అమ్మడు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె గురించి, అలాగే ఫిట్నెస్, స్కిన్ సీక్రెట్స్ తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. 

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన పెద్ది చిత్రంలో నటిస్తుంది. బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అచ్చియమ్మ పాత్రలో కనిపించనుంది. 

ఈ సినిమా ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జాన్వీ కపూర్ తన తల్లి దివంగత హీరోయిన్ శ్రీదేవి మాదిరిగానే ఎంతో అందంగా ఉంటుంది.

టీనేజ్ లో ఆమె బొద్దుగా కనిపించేది. కానీ ఆమె ఆహారం, వ్యాయమం ద్వారా తన బరువును నియంత్రణలోకి తీసుకువచ్చింది. అలాగే మరింత అందంగా మారింది.

తన శరీరం కాస్త చిరాకుగా అనిపించిన వెంటనే గోరువెచ్చని నీటితో ఫ్రెషప్ అవుతానని తెలిపింది. ఎప్పుడు తన  ముఖానికి సహజమైన వస్తువులను ఉపయోగిస్తుంది.

 ముఖ్యంగా పాలు, తేనె, మలై, పెరుగు, పండ్ల రసం నా ముఖానికి ఉపయోగిస్తానని తెలిపింది. ముఖానికి మంచి మెరుపును ఇస్తుంది. రోజ్ వాటర్ , గ్లిజరిన్ ఉపయోగిస్తుందట.

ప్రస్తుతం జాన్వీ కపూర్ తెలుగుతోపాటు హిందీలోనూ వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. అలాగే అటు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో రచ్చ చేస్తుంది.