5

Jr.NTR: ‘ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా’.. జూనీయర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్..

ట్యాంక్ బడ్ వద్దనున్న ఎన్టీఆర్ ఘట్ వద్ద ఆయన కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ తనయుడు ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలాకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు ఎన్టీఆర్ ఘాట్ సందర్శించి నివాళులు అర్పించారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు.

Jr.NTR: 'ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా'.. జూనీయర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్..
Ntr
Follow us

|

Updated on: May 28, 2023 | 3:13 PM

తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక దిగ్గజ దివంగత నటుడు నందమూరి తారక రామారావు. తెలుగు దేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి చరిత్రను సృష్టించారు. తెలుగు తెరపై రాముడిగా.. కృష్ణుడిగా.. దుర్యోధనుడిగా ఆయన పోషించని పాత్ర లేదు. చారిత్రక చిత్రాలు, జానపదాలు, సాంఘికాలు, పౌరాణిక చిత్రాలు చేసిన ఎన్టీఆర్ శతజయంతి నేడు. ఈ సందర్భంగా ట్యాంక్ బడ్ వద్దనున్న ఎన్టీఆర్ ఘట్ వద్ద ఆయన కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ తనయుడు ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలాకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు ఎన్టీఆర్ ఘాట్ సందర్శించి నివాళులు అర్పించారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా తాతను తలుచుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. “మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతుంది. మీరూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని.. ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను. నందమూరి తారకరామారావు” అంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు ఎన్టీఆర్.

ఇవి కూడా చదవండి

అలాగే సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు నందమూరి తారకరామారావుకు నివాళులు అర్పిస్తున్నారు. “తెలుగు జాతి.. తెలుగు సినిమా.. మీకు ఎప్పుడూ రుణపడి ఉంటుంది. ఆత్మ గౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలిపిన మిమ్మల్ని స్మరించుకుంటూ.. జోహార్ ఎన్టీ్ఆర్” అంటూ ట్వీట్ చేశారు హారీశ్ శంకర్. ‘‘ఒక శతాబ్దపు అద్భుతం నందమూరి తారక రామారావు. గొప్ప నటుడు, గొప్ప నాయకుడు, గొప్ప మనసు ఉన్న మనిషి. శతజయంతి సందర్భంగా ఆయనికివే నా ఘన నివాళి’ అంటూ ట్వీట్ చేసారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రేమ జంటకు అండగా పోలీసులు.. అంతలోనే మైండ్ బ్లాంక్ ట్విస్ట్
ప్రేమ జంటకు అండగా పోలీసులు.. అంతలోనే మైండ్ బ్లాంక్ ట్విస్ట్
ఈ నవరాత్రిలో శక్తిపీఠాలను సందర్శించండి.. మీ కోరికలు నెరవేరుతాయి
ఈ నవరాత్రిలో శక్తిపీఠాలను సందర్శించండి.. మీ కోరికలు నెరవేరుతాయి
సోమిరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి కాకాని.. ఎందుకంటే..
సోమిరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి కాకాని.. ఎందుకంటే..
న్యూయార్క్ జూ నుంచి వణ్యప్రాణులు తప్పించుకున్నాయా..?
న్యూయార్క్ జూ నుంచి వణ్యప్రాణులు తప్పించుకున్నాయా..?
మైఖేల్ ని పోలీసులకు పట్టించిన కావ్య, రాజ్ లు.. షాక్ లో రుద్రాణి,
మైఖేల్ ని పోలీసులకు పట్టించిన కావ్య, రాజ్ లు.. షాక్ లో రుద్రాణి,
బెంగుళూరులో ప్రెస్‏మీట్ అడ్డుకోవడంపై సిద్ధార్థ్ రియాక్షన్..
బెంగుళూరులో ప్రెస్‏మీట్ అడ్డుకోవడంపై సిద్ధార్థ్ రియాక్షన్..
విడాకులు తీసుకోనుందంటూ పుకార్లు.. హరితేజ రియాక్షన్‌ ఏంటంటే?
విడాకులు తీసుకోనుందంటూ పుకార్లు.. హరితేజ రియాక్షన్‌ ఏంటంటే?
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు రోజులు భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు రోజులు భారీ వర్షాలు..
అందుకే బాబు జైలుకెళ్లారు.. సజ్జల సంచలన కామెంట్స్..
అందుకే బాబు జైలుకెళ్లారు.. సజ్జల సంచలన కామెంట్స్..
రైతుబిడ్డనే టార్గెట్.. హద్దుమీరిన రతిక, అమర్ దీప్. మానసికంగా దాడి
రైతుబిడ్డనే టార్గెట్.. హద్దుమీరిన రతిక, అమర్ దీప్. మానసికంగా దాడి