Shaakuntalam: ‘శాకుంతలం’ సినిమాకు క్యూకట్టిన అవార్డ్స్..  కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో..

గతంలో ఈ చిత్రానికి న్యూ్యార్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అవార్డ్స్ 2023లో బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్ గా .. బెస్ట్ మ్యూజికల్ ఫిల్మ్ గా అవార్డ్స్ రాగా.. ఇప్పుడు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ అవార్డ్స్ కొల్లగొట్టింది. గత కొద్ది రోజులుగా ఫ్రాన్స్ లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడకలలో శాకుంతలం సినిమాకు ఏకంగా నాలుగు విభాగాల్లో అవార్డ్స్ వచ్చాయి.

Shaakuntalam: 'శాకుంతలం' సినిమాకు క్యూకట్టిన అవార్డ్స్..  కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో..
Shaakuntalam
Follow us

|

Updated on: May 28, 2023 | 3:30 PM

డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత.. దేవ్ మోహన్ జంటగా నటించిన చిత్రం శాకుంతలం. కాళీదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 14న అడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. ఇందులో శకుంతల పాత్రలో సామ్.. దుష్యంతుడిగా దేవ్ మోహన్ పాత్రలో నటించిన ఈ సినిమాను భారీ బడ్జెట్‏తో నిర్మించారు.కానీ ఈ చిత్రం మాత్రం భారీగానే నష్టాలను మిగిల్చింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమాకు అవార్డ్స్ మాత్రం క్యూ కడుతున్నాయి.

గతంలో ఈ చిత్రానికి న్యూ్యార్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అవార్డ్స్ 2023లో బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్ గా .. బెస్ట్ మ్యూజికల్ ఫిల్మ్ గా అవార్డ్స్ రాగా.. ఇప్పుడు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ అవార్డ్స్ కొల్లగొట్టింది. గత కొద్ది రోజులుగా ఫ్రాన్స్ లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడకలలో శాకుంతలం సినిమాకు ఏకంగా నాలుగు విభాగాల్లో అవార్డ్స్ వచ్చాయి. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్, బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్, బెస్ట్ కాస్ట్యూ్మ్ డిజైన్, బెస్ట్ ఇండియన్ ఫిల్మ్ కేటగిరీల్లో సత్తా చాటింది. ఈ విషయాన్ని గుణటీమ్ వర్క్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఇక ఈ సినిమాకు థియేటర్లలో విడుదలైన నెల రోజులకే ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ భరతుడి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆమె నటన ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేసింది అర్హ. ప్రస్తుతం సామ్ ఖుషి చిత్రీకరణలో బిజీగా ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

3 ఫోర్లు, 13 సిక్సర్లు.. రింకూ ఫ్రెండ్ ఊహించని ఊచకోత..
3 ఫోర్లు, 13 సిక్సర్లు.. రింకూ ఫ్రెండ్ ఊహించని ఊచకోత..
రజతం గెలిచిన భారత అథ్లెట్.. కట్‌చేస్తే.. ఊహించని షాక్
రజతం గెలిచిన భారత అథ్లెట్.. కట్‌చేస్తే.. ఊహించని షాక్
భర్తతో కలిసి ఆస్పత్రికి దీపికా పదుకొణె.. డెలివరీ కోసమేనా? వీడియో
భర్తతో కలిసి ఆస్పత్రికి దీపికా పదుకొణె.. డెలివరీ కోసమేనా? వీడియో
ఇంగ్లండ్ జట్టు నుంచి స్టార్ బౌలర్‌ ఔట్.. కారణం ఏంటంటే?
ఇంగ్లండ్ జట్టు నుంచి స్టార్ బౌలర్‌ ఔట్.. కారణం ఏంటంటే?
వరద బాధితులకు విరాళమిచ్చిన ఏకైక నటి.. పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?
వరద బాధితులకు విరాళమిచ్చిన ఏకైక నటి.. పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?
మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం.. తులం ఎంతంటే?
మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం.. తులం ఎంతంటే?
Weekly Horoscope: వారు ఆర్థిక లావాదేవీల విషయంలో కాస్త జాగ్రత్త..
Weekly Horoscope: వారు ఆర్థిక లావాదేవీల విషయంలో కాస్త జాగ్రత్త..
నోరూరించే బ్లాక్ మటన్ కర్రీ.. ఇలా వండారంటే అదిరిపోతుంది..
నోరూరించే బ్లాక్ మటన్ కర్రీ.. ఇలా వండారంటే అదిరిపోతుంది..
ఆకాశానికి చిల్లు పడ్డట్లే.. మళ్లీ కుండపోత వర్షం.. హై అలర్ట్..
ఆకాశానికి చిల్లు పడ్డట్లే.. మళ్లీ కుండపోత వర్షం.. హై అలర్ట్..
పిగ్మెంటేషన్, మొటిమలకు బైబై చెప్పాలంటే ఉల్లిపాయతో ఇలా చేయండి..
పిగ్మెంటేషన్, మొటిమలకు బైబై చెప్పాలంటే ఉల్లిపాయతో ఇలా చేయండి..
అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు