AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravindra Jadeja: ‘యూ ఆర్ మై ఎమ్మెల్యే’.. చెన్నైను గెలిపించగానే  భార్యను హత్తుకున్న జడేజా.. వీడియో చూశారా?

డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం గుజరాత్‌ విధించిన 171 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఆఖరి బంతికి బౌండరీ కొట్టి చెన్నైను విజయ తీరాలకు చేర్చాడు. కాగా జడ్డూ ఫోర్‌ కొట్టగానే స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. ఇదే సమయంలో మ్యాచ్‌ చూడడానికి వచ్చిన జడ్డూ సతీమణి రివాబా జడేజా భావోద్వేగానికి లోనైంది

Ravindra Jadeja: 'యూ ఆర్ మై ఎమ్మెల్యే'.. చెన్నైను గెలిపించగానే  భార్యను హత్తుకున్న జడేజా.. వీడియో చూశారా?
Ravindra Jadeja, Rivaba
Basha Shek
|

Updated on: May 30, 2023 | 3:02 PM

Share

మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరోసారి అదరగొట్టింది. సోమవారం ముగిసిన ఐపీఎల్‌ ఫైనల్‌లో ఛాంపియన్‌గా ఆవిర్భవించింది. తద్వారా ఐదుసార్లు టైటిల్స్‌ అందుకున్నముంబై ఇండియ‌న్స్ రికార్డును స‌మం చేసింది. అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం గుజరాత్‌ విధించిన 171 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఆఖరి బంతికి బౌండరీ కొట్టి చెన్నైను విజయ తీరాలకు చేర్చాడు. కాగా జడేజా ఫోర్‌ కొట్టగానే స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. ఇదే సమయంలో మ్యాచ్‌ చూడడానికి వచ్చిన జడ్డూ సతీమణి రివాబా జడేజా భావోద్వేగానికి లోనైంది.  పట్టరాని ఆనందంతో కన్నీరు పెట్టుకుంటూ మైదానంలోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

అదే సమయంలో జడేజా కూడా భార్యను చూసి ఆమె దగ్గరికి వచ్చాడు. సంతోషంతో సతీమణిని హత్తుకుని ఎమోషనల్‌ అయ్యాడు. రివాబా కూడా చిరునవ్వులు చిందిస్తూ జడేజాను మనసారా హత్తుకుంది. ఈ ఎమోషనల్‌ మూమెంట్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మ్యాచ్‌ ప్రజేంటేషన్‌ అనంతరం ఐపీఎల్‌ ట్రోఫీతో కలిపి కెమెరాలకు పోజులిచ్చారు జడేజా ఫ్యామిలీ. సతీమణి రివాబాతో పాటు వారి కూతురును కూడా మనం ఈ ఫొటోలు, వీడియోల్లో చూడవచ్చు. కాగా 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్ నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు రివాబా జడేజా.  బీజేపీ తరఫున ఆమె బరిలోకి దిగారు.

రవీంద్ర జడేజా ఎమోషనల్ వీడియో 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో