AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: గుబురు గడ్డంతో గుర్తుపట్టలేకుండా మారిపోయిన స్టార్‌ హీరో.. షాకవుతోన్న ఫ్యాన్స్‌.. ఎవరో తెలుసా?

ఈ ఫొటోలో గుబురు గడ్డం పెంచుకొని కనిపిస్తోన్న స్టార్‌ హీరో ఎవరో గుర్తుపట్టారా? ఇతను కోలీవుడ్‌ ఇండస్ట్రీకి చెందిన హీరో అయి ఉండచ్చు.. కానీ పాన్‌ ఇండియా రేంజ్‌లో క్రేజ్‌ ఉంది. అన్నట్లు ఈ మధ్యన హాలీవుడ్‌ సినిమాల్లో కూడా నటిస్తూ బిజీబిజీగా ఉంటున్నాడు.

Tollywood: గుబురు గడ్డంతో గుర్తుపట్టలేకుండా మారిపోయిన స్టార్‌ హీరో.. షాకవుతోన్న ఫ్యాన్స్‌.. ఎవరో తెలుసా?
Hero
Basha Shek
|

Updated on: May 29, 2023 | 6:52 PM

Share

ఈ ఫొటోలో గుబురు గడ్డం పెంచుకొని కనిపిస్తోన్న స్టార్‌ హీరో ఎవరో గుర్తుపట్టారా? ఇతను కోలీవుడ్‌ ఇండస్ట్రీకి చెందిన హీరో అయి ఉండచ్చు.. కానీ పాన్‌ ఇండియా రేంజ్‌లో క్రేజ్‌ ఉంది. అన్నట్లు ఈ మధ్యన హాలీవుడ్‌ సినిమాల్లో కూడా నటిస్తూ బిజీబిజీగా ఉంటున్నాడు. లవ్, సీరియస్‌, కామెడీ, యాక్షన్‌, థ్రిల్లర్‌.. ఇలా ఏ జానర్‌కైనా ఈ స్టార్‌ హీరో సూట్‌ అవుతాడు. అందుకే ఇతనికి దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇక తెలుగునాట కూడా భారీ ఫాలోయింగ్‌ ఉంది. అందుకే ఇటీవల నేరుగా తెలుగు సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది.. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో.. యస్‌.. పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు ఇటీవల మనకు పాఠాలు చెప్పేందుకు వచ్చిన ‘సార్‌’ హీరో, కోలీవుడ్ స్టార్‌ ధనుష్‌. తాజాగా ముంబై ఎయిర్‌ పోర్ట్‌లో కనిపించిన ధనుష్‌ పెరిగిన జుట్టు, గుబురు గడ్డంతో గుర్తుపట్టలేకుండా మారిపోయాడు. దీనికి తోడు నల్లటి అద్దాలు ధరించి ఉండడంతో అతనిని వెంటనే గుర్తుపట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో ధనుష్‌ న్యూ లుక్‌ ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారిపోయాయి.

ఇవి కూడా చదవండి

కాగా ధనుష్‌ న్యూ లుక్‌ సినిమా కోసమా? లేక ఆధ్యాత్మిక చింతన కోసమా? అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఇక సార్‌ సినిమా తర్వాత కెప్టెన్‌ మిల్లర్‌ అనే మూవీలో నటిస్తున్నాడు ధనుష్‌. 1930 – 1940 మధ్య కాలం నాటి వాస్తవిక ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అందుకోసమే ధనుష్‌ జుట్టు, గడ్డం పెంచుకుంటున్నారని తెలుస్తోంది. అరుణ్ మాథేశ్వరన్‌ ఈ హిస్టారికల్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత కూడా ఆయనే. తెలుగు యంగ్‌ హీరో సందీప్ కిషన్‌ తో పాటు శివరాజ్‌ కుమార్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రియాంకా అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి.

Follow Us
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!